న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలు అతనికి బుర్ర ఉందా?.. స్టార్ ఆటగాడిపై అక్తర్ ఫైర్!!

He does not have a brain: Shoaib Akhtar slams Fakhar Zaman after mediocre show

కరాచీ: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్టయిలే వేరు. ఏ దేశ ఆటగాడిపైన అయినా మండిపడుతుంటాడు. ఆటగాడు పరుగులు చేయకపోయినా, వికెట్లు తీయకపో యినా తనదైన శైలిలో చురకలు అంటిస్తాడు. తాజాగా పాక్ స్టార్ ఆటగాడు ఫకర్ జమాన్‌పై అక్తర్ తీవ్రంగా మండిపడ్డాడు. ఫకర్ జమాన్‌కు అసలు బుర్ర ఉందా అని వ్యాఖ్యానించాడు.

పీఎస్ఎల్‌ విఫలం:

పీఎస్ఎల్‌ విఫలం:

ప్రస్తుతం పాక్ గడ్డపై పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతోంది. పీఎస్ఎల్ జట్టు లాహోర్ ఖలండర్స్‌కు ఫకర్ జమాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో 24.66 సగటు, 125.42 స్ట్రైక్‌రేట్‌తో 74 పరుగులు మాత్రమే చేశాడు. పేలవమైన అతడి ప్రదర్శనపై షోయబ్ విరుచుకుపడ్డాడు. అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ జమాన్‌పై ఫైర్ అయ్యాడు.

అతనికి బుర్ర ఉందా?:

అతనికి బుర్ర ఉందా?:

'బుర్ర లేని వ్యక్తి ఫకర్ జమాన్. జట్టులో ఉన్న ఒకే ఒక్క ఆటగాడు (క్రిస్ లిన్) వేగంగా ఆడి అవుటైనప్పుడు ఫకర్ అర్థం చేసుకుని నెమ్మదిగా ఆడాలి. అంతేకాని అతడు కూడా భారీ షాట్లు ఆడి పెవిలియన్ చేరాడు. అసలు అతనికి బుర్ర ఉందా?. క్రిస్‌లిన్ ఏమీ వివ్ రిచర్డ్స్ కాదు. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్‌లపై బాగా ఆడతాడు. ఇలాంటి దూకుడు ఆటగాడు జట్టులో ఉండాల్సిన అవసరం ఉంది' అని అక్తర్ పేర్కొన్నాడు.

బాదుడుపైనే దృష్టి పెడతారు:

బాదుడుపైనే దృష్టి పెడతారు:

ఖలండర్స్ బ్యాటింగ్ లైనప్ ఇటువంటి వారితో నిండిపోయింది. వారు తెలివిగా ఆడకుండా బాదుడుపైనే దృష్టి పెడతారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడొచ్చు. కానీ.. ఆ తర్వాతి కొన్ని ఓవర్ల పాటు మాత్రం సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాలి. ఆపై మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి' అని అక్తర్ సూచించారు. ఫకర్‌పై అక్తర్ విరుచుకుపడడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైన తర్వాత ఫకర్ బ్యాటింగ్ టెక్నిక్‌ను అక్తర్ ప్రశ్నించాడు.

క్రికెట్ ఎందుకు ఆడొద్దు:

క్రికెట్ ఎందుకు ఆడొద్దు:

భారత్- పాకిస్థాన్ మధ్య టమాట, ఉల్లిగడ్డల వ్యాపారం జరుగుతున్నప్పుడు ఇరుదేశాల మధ్య క్రికెట్ ఎందుకు ఉండకూడదు అని అక్తర్ ఇటీవలే ప్రశ్నించాడు. 'రెండు దేశాలు వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాయి. కబడ్డీ, డేవిస్‌ కప్‌ కూడా ఆడుతాయి. అలాంటప్పుడు క్రికెట్‌‌కు ఏమైంది? భారత్‌.. పాకిస్థాన్‌కు రాలేదని, పాక్‌.. భారత్‌కు వెళ్లలేదని నాకు తెలుసు. కానీ ఇరు దేశాలు తటస్థ వేదికలపై ఆసియా కప్, చాంపియన్స్‌ట్రోఫీలు ఆడుతున్నాయి. అలాగే ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా తటస్థ వేదికలపై ఎందుకు ఆడకూడదు?' అని అక్తర్ ప్రశ్నించాడు.

Story first published: Wednesday, March 4, 2020, 10:21 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X