న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏదేమైనా తుది నిర్ణయం అపెక్స్ కౌన్సిల్‌దే

HCA: Anil clears the air on selection controversy

హైదరాబాద్: అపెక్స్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాలే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో అంతిమమని హెచ్‌సీఏ ఇన్‌ఛార్జ్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ తెలిపాడు. అపెక్స్ కౌన్సిల్‌ను ఖాతరు చేయకుండా హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ వ్యక్తిగత స్వలాభం కోసం సొంత నిర్ణయాలను ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు.

మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో అనిల్ కుమార్ మాట్లాడారు. హెచ్‌సీఏ వార్షిక సమావేశం సందర్భంగా శివాజీ, రమేశ్, నిరంజన్, అర్జున్, సయ్యద్ మిరాజ్‌లతో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. హెచ్‌సీఏలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సీఈఓదేనని తెలిపారు. అందులో భాగంగానే కేఎస్‌సీఏ(కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్) టోర్నీ కోసం అపెక్స్‌ కౌన్సిల్‌ ఎంపిక చేసిన జట్టు వివరాలను సీఓఏ విడుదల చేయగా.. హెచ్‌సీఏ కార్యదర్శి మరో జట్టును ఎంపిక చేశారన్నారు.

క్రికెటర్లు ఎవరిని అనుసరించాలో అర్థంకాక తికమకపడుతున్నారని.. వారికి నిజాలు తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు. లోథా సిఫారసుల ప్రకారం హెచ్‌సీఏ సీఈవోకు అన్ని అధికారాలు ఉన్నాయని, హెచ్‌సీఏ సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుకు ప్రయాణవసతులు సమకూర్చాలన్న విషయంలో సీఈవోదే అధికారమని హెచ్‌సీఏ సీఈవో పాండురంగమూర్తి చెప్పారు. జట్టును ప్రకటించే అధికారం శేష్‌నారాయణకు లేదని ఆయన స్పష్టం చేశారు.

రెండు జట్ల వివరాలు పంపడంతో నిర్వాహకులు హైదరాబాద్‌ను టోర్నీ నుంచి తప్పించారని తెలిపారు. హెచ్‌సీఏలో అపెక్స్‌ కౌన్సిల్‌దే తుది నిర్ణయమని, వ్యక్తిగత నిర్ణయాలు చెల్లుబాటు కావన్నారు. సీఈఓ పాండు రంగమూర్తి మాట్లాడుతూ... జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సులకు జనవరిలోనే హెచ్‌సీఏ ఆమోదం తెలిపిందని, దాని ప్రకారం పూర్తి నిర్ణయాధికారం సీఈఓకే ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఐదుగురితో కూడిన సెలెక్షన్‌ కమిటీని నియమించామని.. ఆ కమిటీ జట్టును ఎంపిక చేస్తుందని వివరించారు.

Story first published: Wednesday, July 18, 2018, 14:28 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X