న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ అతి విశ్వాసమే టైగా ముగిసేలా చేసిందా??

‘Have to Embrace Everything that Comes Our Way’

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డే తీవ్ర ఉత్కంఠ నడుమ ఆఖరికి టైగా ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ వల్లనే ఇలాంటి ఫలితాన్ని ఎదుర్కొన్నామని భారత క్రికెట్ అభిమానులు విమర్శలు సంధిస్తున్నారు. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే.. టాస్ రూపంలో భారత్‌కి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం వచ్చినా.. విరాట్ కోహ్లి చేజార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

1
44267
బౌలింగ్ చేయాలనుకోవడం దాదాపు ప్రయోగమే:

బౌలింగ్ చేయాలనుకోవడం దాదాపు ప్రయోగమే:

దీంతో అప్పటికే విశాఖపట్నం పరిసరాల్లో రాత్రి 7 గంటల తర్వాత మంచు కురుస్తుందన్న విషయం కోహ్లీ తెలుసుకోవాల్సింది. ఈ విషయం టీమిండియా మేనేజ్‌మెంట్‌కి తెలియంది కాదు. అయినప్పటికీ.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లి బౌలర్లపై ఉన్న అతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. బ్యాటింగ్ ఎంచుకుని సెకండాఫ్‌లో బౌలింగ్ చేసేందుకు ప్రయోగానికే ఒడిగట్టాడు.

భారత్‌కు 321 కలిసిరావడం లేదా?

వెస్టిండీస్ లక్ష్యానికి చేరువగా రాగలిగిందంటే

వెస్టిండీస్ లక్ష్యానికి చేరువగా రాగలిగిందంటే

దీంతో.. బోర్డుపై 322 పరుగుల భారీ టార్గెట్ ఉన్నా.. వరుసగా వికెట్లు పడుతున్నా.. వెస్టిండీస్ లక్ష్యానికి చేరువగా రాగలిగిందంటే దానికి కారణం భారత బౌలర్లకి బంతిపై పట్టు చిక్కకపోవడమే. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా అంగీకరించాడు. ఇంతకుముందు జరిగిన తొలి వన్డే గౌహతి వేదికగా భారత్ జట్టు ఛేదనకు దిగే 323 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించిన విషయం తెలిసిందే.

బంతిపై గ్రిప్ సరిగా దొరకలేదని

బంతిపై గ్రిప్ సరిగా దొరకలేదని

‘మంచు కారణంగా బౌలింగ్ చేయడం చాలా కష్టమైంది. బంతిపై గ్రిప్ సరిగా దొరకలేదు'అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. వాస్తవానికి గత కొద్దిరోజులుగా విశాఖపట్నం వన్డే గురించి మాట్లాడుతున్న సమయంలో.. విశ్లేషకులు టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా టీమ్‌లో లేరు. కోహ్లి ఆ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో

వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సులు) సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది.

Story first published: Thursday, October 25, 2018, 12:10 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X