న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు 321 కలిసిరావడం లేదా?

India 321 score doesnt helps to win

వైజాగ్: ముందుగా ఊహించినట్లుగా విశాఖపట్నం స్టేడియం ఇరు జట్లకు అనుకూల ఫలితాలనే తెచ్చిపెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పది వేల పరుగులను పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో నాటౌట్‌గా నిలిచి 157పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 50 ఓవర్లలో 300 పరుగులు చేస్తే భారీ స్కోరు కిందే లెక్క.

ఒక వన్డేతో ఏడు రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ ఒక వన్డేతో ఏడు రికార్డులు బద్దలు కొట్టిన విరాట్

టీమిండియాకు ఆ అంకె మాత్రం నిరాశనే

టీమిండియాకు ఆ అంకె మాత్రం నిరాశనే

300 పైచిలుకు విజయలక్ష్యాన్ని చాలా జట్లు అనేక సందర్భాల్లో చేధించినప్పటికీ.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఆ స్కోరు సాధిస్తే సగం విజయం సాధించేశామన్న ధీమాతో ఉంటాయి. భారత్‌ కూడా చాలాసార్లు 300కు పైగా స్కోరు సాధించి కొన్నిసార్లు గెలిచింది.. మరికొన్నిసార్లు ఓడింది. అయితే టీమిండియాకు ఓ అంకె మాత్రం ఎప్పుడూ నిరాశనే మిగుల్చుతోంది.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ టైగా

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ టైగా

అదే 321. వన్డేల్లో భారత్‌ ఈ స్కోరును గతంలో రెండు సార్లు సైతం పరాజయం పాలైంది. బుధవారం విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ టైగా ముగిసింది. భారీస్కోరు సాధించినా విజయం సాధించకపోవడం భారత అభిమానుల్లో నిరాశ నింపింది. దీంతో టీమిండియాకు 321 స్కోరు అచ్చిరాదని అభిమానులు అనుకుంటున్నారు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2007లోనూ:

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2007లోనూ:

2007లో ఛండీగడ్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్ల 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. సచిన్‌ టెండూల్కర్‌(99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అనంతరం బరిలోకి దిగిన పాక్‌.. యూనిస్‌ ఖాన్‌(117) అద్భుత సెంచరీతో మరో బంతి మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించి విజయం

48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించి విజయం

2017లో ఓవల్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(125) సెంచరీకి తోడు రోహిత్‌ శర్మ(78), ధోనీ(63) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించి విజయం సాధించింది.

Story first published: Thursday, October 25, 2018, 11:46 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X