ఫోన్ చేసి షమీ బెదిరిస్తున్నాడు: భార్య హసీన్‌ తాజా ఆరోపణ

Posted By:
Hasin Jahan says Mohammed Shami 'threatening me over phone'

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసిన్ జహాన్ తాజాగా మరో ఆరోపణ చేసింది. వేరు వేరు నెంబర్ల నుంచి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చింది. మంగళవారం ఆమె మీడియాతో మట్లాడుతూ తెలియని నెంబర్ల నుంచి షమీ ఫోన్ చేసి ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని బెదిరిస్తున్నాడని వెల్లడించింది.

ఫోన్ స్విచ్ఛాఫ్: మీడియాతో మాట్లాడొద్దు, అజ్ఞాతంలోకి షమీ!

'షమీ నన్ను ఫోన్‌లో బెదిరిస్తున్నాడు. వేరే రకాలుగా కూడా నాకు బెదిరింపు సంకేతాలు పంపుతున్నాడు. నన్ను బెదిరించేందుకు వేరు వేరు ఫోన్‌ నంబర్లు వాడుతున్నాడు. నా వల్లే తన కెరీర్ చిక్కుల్లో పడిందని అంటున్నాడు. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకుంటే నన్ను ఇబ్బందులకు గురి చేస్తానని బెదరిస్తున్నాడు' అని హసిన్ జహాన్ తెలిపింది.

'వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నాడు. ఇలా చేస్తున్నందుకు షమి సిగ్గుపడాలి. తన క్రికెట్ కెరీర్‌ను రక్షించుకోవాలని చూస్తున్నాడు. నాకు నేనుగా ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోను. నాకు న్యాయం జరిగే వరకు రాజీ పడను, పోరాటం ఆపను. షమీ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు. దీంతో భద్రత కోసం కోల్‌కతా పోలీసులకు కోరా' అని హసీన్‌ చెప్పింది.

కాగా, షమీ మీడియా ద్వారా చేసిన రాజీ ప్రతిపాదన గురించి హసీన్‌ దగ్గర ప్రస్తావించగా తన కెరీర్‌ను కాపాడుకోవడం కోసమే ఈ ప్లానే వేశాడని పేర్కొంది. గుర్తు తెలియని నెంబర్ నుంచి షమీ తన ఫోన్‌కు పెట్టిన మేసేజ్‌ని ఈ సందర్భంగా హసిన్ జహాన్ మీడియా ముందు ఉంచింది.

అన్నతో రేప్ చేయించబోయాడు: షమీపై మరో బాంబు పేల్చిన భార్య

తన కుమార్తెతో మాట్లాడాలని ఉందని అందులో షమీ కోరాడని... అయితే దానికి తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని చెప్పానని తెలిపింది. కాగా, తనను రెండేళ్లుగా షమి వేధిస్తున్నాడని, తనను చంపించే ప్రయత్నం చేశాడని, అతడి సోదరుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ షమీతో సహా అతడి కుటుంబసభ్యులపై హసీన్‌ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, March 14, 2018, 15:40 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి