ఏడాదిగా పోరాటం చేస్తూ విజయం సాధించా.. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు: షమీ భార్య

Mohammad Shami Thinks He Is Too Powerful, And A Big Cricketer Says Hasin Jahan || Oneindia Telugu

కోల్‌కతా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కలకత్తాలోని అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్

15 రోజులు గడువు:

15 రోజులు గడువు:

మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని అలిపోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజులు గడువు ఇచ్చింది. ఒకవేళ ఈ 15 రోజుల సమయంలో కోర్టు ఎదుట హాజరుకాని పక్షంలో షమీ, అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

'న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు:

'న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు:

షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో హసీన్ స్పందించారు. 'న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. దాదాపు ఏడాదిగా పోరాటం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు.. షమీ తానో పెద్ద క్రికెటర్‌నని, చాలా పవర్‌ఫుల్ అని అనుకుంటాడు. నేను బెంగాలీని కాకపోతే, బెంగాల్‌కు మమతా బెనర్జీ సీఎం కాకపోయి ఉంటే ఇక్కడ నేను సురక్షితంగా జీవించలేను. అమ్రోహా (ఉత్తర ప్రదేశ్) పోలీసులు నన్ను, నా కూతుర్ని వేధించడానికి ప్రయత్నించారు. దేవుడి దయ వల్ల వారు విజయవంతం కాలేదు' అని హసీన్ పేర్కొన్నారు.

చార్జ్‌షీట్‌ను పరిశీలించాకే:

చార్జ్‌షీట్‌ను పరిశీలించాకే:

షమీ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు షమీపై ఎటువంటి చర్యలు తీసుకోము అని స్పష్టం చేసింది. ఇక రాబోయే రెండు రోజుల్లో బీసీసీఐ అధికారులు షమీ న్యాయ సలహాదారులతో మాట్లాడనున్నారు.

'చెత్త మాటలు మాట్లాడొద్దు.. బుమ్రా నిబంధనల ప్రకారమే బౌలింగ్‌ చేస్తున్నాడు'

గృహహింస కేసు:

గృహహింస కేసు:

గత ఏడాది మార్చిలో షమీ భార్య హసీన్.. షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు వాట్సాప్ ఛాటింగ్ స్ర్కీన్ షాట్‌లు, ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాక.. షమీ, అతని కుటుంబ సభ్యులు తనపై హత్యాయత్నం చేశారని, లైంగికంగా వేధించారని ఆమె గృహహింస కేసు పెట్టింది. దీంతో షమీతో పాటు అతని సోదరునిపై ఐపీసీ 498ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, September 3, 2019, 16:09 [IST]
Other articles published on Sep 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X