న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'చెత్త మాటలు మాట్లాడొద్దు.. బుమ్రా నిబంధనల ప్రకారమే బౌలింగ్‌ చేస్తున్నాడు'

Gavaskar Slams Critics For Questioning Bumrah’s Bowling Action || Oneindia Telugu
Jasprit Bumrah’s action: Sunil Gavaskar, Ian Bishop slam doubters

కింగ్‌స్టన్‌: విమర్శకులు అదేపనిగా చెత్త మాటలు మాట్లాడకూడదు. జస్ప్రీత్ బుమ్రా నిబంధనల ప్రకారమే బౌలింగ్‌ చేస్తున్నాడు అని దిగ్గజ భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డాడు. విండీస్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో ఘ‌న విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి.. ఒక ఇన్నింగ్స్‌లో 12 మంది బ్యాటింగ్!!అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి.. ఒక ఇన్నింగ్స్‌లో 12 మంది బ్యాటింగ్!!

రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా హ్యాట్రిక్‌ సాధించిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్‌ పూర్తి చేశాక కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్‌తో ప్రసిద్ధ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌ మాట్లాడుతూ.. 'కొందరు బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని' అంటున్నారని గుర్తుచేశాడు. దీంతో బుమ్రా బౌలింగ్‌ శైలిని తప్పుపడుతున్న వారికి సునీల్‌ గవాస్కర్‌ గట్టి సమాధానమిచ్చాడు.

'బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకమైనది. ఒక్కసారి అతడి రనప్‌ చూస్తే.. కొన్ని అడుగులు వేశాక వేగంగా వెళ్లి బంతిని వేస్తున్నాడు. ఈ సమయంలో బుమ్రా భుజం నేరుగా ఉంటోంది. నిబంధనల ప్రకారమే అతడు బౌలింగ్‌ వేస్తున్నాడు. శైలి బౌలింగ్ నియమాలకు లోబడి ఉంటుంది. నిజంగా కొంతమంది దీన్ని అద్దంలో చూడాలి. విమర్శకులు అదేపనిగా చెత్త మాటలు మాట్లాడకూడదు' అని గవాస్కర్‌ స్పందించాడు.

'కోహ్లీ ఆర్థిక సహాయం చేయకుంటే.. ఏం సాధించేవాడిని కాదు''కోహ్లీ ఆర్థిక సహాయం చేయకుంటే.. ఏం సాధించేవాడిని కాదు'

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను బుమ్రా బెంబేలెత్తించాడు. ఏడో ఓవర్లోనే ఓపెనర్ క్యాంప్‌బెల్‌ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఇక తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి డారెన్‌ బ్రావో (4)ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి బ్రావో బ్యాట్‌ను టచ్ చేస్తూ.. స్లిప్‌లో ఉన్న రాహుల్‌ చేతిలో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్స్ (0) వికెట్ల ముందు దొరికి పోయాడు. అనంతరం చేజ్‌ (0) కూడా పరుగులేమీ చేయకుండా ఎల్బీ ఔట్‌ అయ్యాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున బుమ్రా సాధించిన ఈ హ్యాట్రిక్ మూడోది. మొత్తంగా 44వ హ్యాట్రిక్.

Story first published: Tuesday, September 3, 2019, 14:40 [IST]
Other articles published on Sep 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X