న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలనుకున్నా'

Harmanpreet Kaur wanted to take a break from international cricket following Mithali Raj row in T20 World Cup

ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలనుకున్నా అని భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపారు. గత నవంబర్ నెలలో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పక్కకు పెట్టడం వివాదం అయింది. వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసి ఫామ్‌ మీదున్న మిథాలీని తప్పిస్తూ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, వైస్‌కెప్టెన్ స్మృతి మందన, చీఫ్ కోచ్ రమేవ్ పవార్, సెలెక్షన్ కమిటీ సభ్యురాలు సుధాషా మూకుమ్మడి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నిర్ణయంపై అటు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర విమర్శలు చేశారు. టీ20 ప్రపంచకప్‌ లాంటి కీలకమైన మ్యాచ్‌లో మిథాలీని తప్పించాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. వివాదంపై మిథాలీ రాజ్ స్పందించి.. కోచ్ రమేష్ పొవార్, సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీపై మిథాలీ ఆరోపణలు చేసింది. మిథాలీ రాజ్‌ను తప్పించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తాను చాలా కలత చెందినట్లు కౌర్‌ తెలిపారు.

'మిథాలీని తప్పించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటు బీసీసీఐ వివరణ కోరడం మనోవేదనకు గురి చేసింది. ప్రతి ఒక్కరు నన్నే టార్గెట్ చేశారు. ఆ సమయంలో క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని భావించాను. ఇదే విషయాన్ని మా తల్లి దండ్రులు కూడా చెప్పను. నన్ను అర్థం చేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించారు. అయితే తాను ఒక సీనియర్‌ క్రీడాకారిణి కావడంతో మరలా ఆలోచించాను' అని హర్మన్‌ప్రీత్‌ కౌర్ తెలిపారు.

'ఆ సమయంలో జరిగిన విషయాన్ని పక్కనపెట్టేశా. వివాదాలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదనుకున్నా. క్రికెట్‌ ఆడటానికి వచ్చిన విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకున్నా. నన్ను ఎవరైనా అనవరసరమైన వివాదాల్లో లాగాలనే చూస్తే జట్టును కూడా ఇరుకున పెట్టడమే అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఇక నుంచి తనపై ఎటువంటి రూమర్లు వచ్చినా వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నా' అని హర్మన్‌ చెప్పారు.

Story first published: Friday, May 24, 2019, 16:23 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X