న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కావాలనే కోచ్ వివాదం పెద్దది చేస్తున్నావ్'

Harmanpreet Kaur Exaggerating Role Of Coach In Team, Says Sanjay Manjrekar

న్యూ ఢిల్లీ: బీసీసీఐ లేఖ రాయడం ద్వారా కోచ్‌కు తనకు సఖ్యత లేదని మిథాలీ బయటపెట్టింది. ఈ కారణంతోనే తనను జట్టు నుంచి తప్పించారంటూ ఆమె ఆవేదన వెల్లగక్కింది. జట్టు సహచరురాలికి సహకరించకుండా భారత మహిళల జట్టు కోచ్‌గా రమేష్ పొవార్‌ను కొనసాగించాలంటూ కోరుతూ టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ బీసీసీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

వివాదాన్ని వదిలేసి ముందుకు సాగితే

జట్టులో కోచ్‌ పాత్రను పెంచడానికి హర్మన్‌ ప్రయత్నిస్తోందనే విషయం గుర్తు చేశాడు. ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలేసి ముందుకు సాగితే బాగుంటుందని సూచించాడు. ‘పొవార్‌ కోచ్‌గా లేని సమయంలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. టైటిల్‌ కూడా గెలిచేది. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్‌ గుర్తుంచుకోవాలి. పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి తీసేస్తే, అక్కడి నుంచి కొత్తగా మొదలు పెట్టాలి. అంతేగాని కోచ్‌ పదవీ కాలాన్ని పెంచుకుంటూపోకూడదు' అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

మాలో మార్పులకు ఆయనే కారణం

మాలో మార్పులకు ఆయనే కారణం

‘టీ20 కెప్టెన్‌గా, వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌గా పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలని కోరుతున్నాను. ఆయన జట్టులో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆయణ్ని మరొకరితో భర్తీ చేయడం కష్టం. టీ20 ప్రపంచ కప్‌కు మరో 15 నెలల సమయమే ఉన్నందున, ఈ సమయంలో కోచ్‌ను మార్చడం సరైన నిర్ణయం కాదు. ఆటలోనే కాదు మా వ్యక్తిత్వాలలోనూ మార్పులు తీసుకొచ్చాడు. జట్టు ఇంతటి వృద్ధి సాధించిందంటే ఆయనే కారణం' అని హర్మన్‌ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

మిథాలీ రాజ్ మాత్రం మౌనంగా

మిథాలీ రాజ్ మాత్రం మౌనంగా

టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సైతం కోచ్‌ను కొనసాగించాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాసింది. గతంలో టీమిండియా మహిళా జట్టుకు కోచ్‌గా ఉన్న తుషార్ అరోథెపై ఫిర్యాదులు ఆరోపించింది హర్మన్. ఆ తర్వాత అతని పదవీకాలం పూర్తవకముందే తానంతట తానే ఆ పదవిని వైదొలగటం గమనార్హం. అప్పటి హర్మన్ ఆరోపణలతో స్మృతి మంధాన గొంతు కలిపింది. కానీ, మిథాలీ రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోయింది.

Story first published: Wednesday, December 5, 2018, 17:21 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X