న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్ మిథాలీ కాదు, కౌర్: టీ20 సిరిస్‌పై కన్నేసిన భారత్

By Nageshwara Rao
Harmanpreet Kaur back at the helm as India take on South Africa in five-match T20I series

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు టి20పై కన్నేసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్‌‌లో తొలి టీ20 మంగళవారం ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, మూడో వన్డేలో ఓడిన భారత్‌.. టీ20 సిరీస్‌లో శుభారంభం చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది.

తొలి రెండు వన్డేల్లో సఫారీలపై మిథాలీసేన పూర్తి ఆధిక్యం కనబర్చిన సంగతి తెలిసిందే. అయితే టీ20ల్లో కొత్త కెప్టెన్‌ ఆధ్వర్యంలో భారత మహిళల జట్టు తలపడుతోంది. డాషింగ్‌ బ్యాట్స్‌ ఉమన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలో టీ20 ఫార్మాట్‌లోనూ తమ ఆధిపత్యం చాటాలని భావిస్తోంది.

Harmanpreet Kaur back at the helm as India take on South Africa in five-match T20I series

వన్డే సిరీస్‌లో సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్‌ ఉమన్‌ స్మృతి మందాన వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ టీ20 సిరిస్‌లో 17 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌ ఆకర్షణగా నిలవనుంది. భారత క్రీడాకారిణుల్లో స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉన్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశారు. హోబార్డ్ హరికేన్స్ తరుపున ప్రాతినిథ్యం వహించిన వేద కృష్ణమూర్తి 9 ఇన్నింగ్స్‌ల్లో 144 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇక, టీ20 స్పెషలిస్ట్‌ అనూజ పాటిల్‌, తొలిసారి టీ20 జట్టులో చోటు పొందిన ఆల్‌రౌండర్‌ రాధా యాదవ్‌, వికెట్‌ కీపర్‌ నుజహాత్‌ ప్రవీణ్‌లతో భారత్‌ పటిష్టంగా కనిపిస్తోంది. మూడో వన్డేకు విశ్రాంతి తీసుకున్న సీనియర్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి తిరిగి జట్టులోకి రావడంతో భారత్‌ బలం పెరగనుంది.

భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో తొలి రెండు టీ20 మ్యాచ్‌లను క్రికెట్ దక్షిణాఫ్రికా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, చివరి మూడు మ్యాచ్‌లను టెలివిజన్‌లో ప్రసారం కానున్నాయి.

ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండిస్ వేదికగా వరల్డ్ టీ20 టోర్నీ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్లకు చక్కటి ప్రాక్టీస్‌లాగా ఈ సిరిస్ ఉపయోగపడనుంది. భారత మహిళల జట్టు చివరిసారిగా టీ20 మ్యాచ్‌ని 2016, డిసెంబర్‌లో ఆసియా కప్‌లో ఆడింది.

జట్ల వివరాలు:
ఇండియా
Harmanpreet Kaur (captain), Smriti Mandhana (vice-captain), Mithali Raj, Veda Krishnamurthy, Jemimah Rodrigues, Deepti Sharma, Anuja Patil, Taniya Bhatia, Nuzhat Parveen Poonam Yadav, Rajeshwari Gayakwad, Jhulan Goswami, Shikha Pandey, Pooja Vastrakar, Radha Yadav.

దక్షిణాఫ్రికా:
Dane van Niekerk (captain), Marizanne Kapp, Trisha Chetty, Shabnim Ismail, Ayabonga Khaka, Masabata Klaas, Sune Luus, Odine Kirsten, Mignon du Preez, Lizelle Lee, Chloe Tryon, Nadine de Klerk, Raisibe Ntozakhe, Moseline Daniels.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 11:37 [IST]
Other articles published on Feb 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X