న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాండ్యా తప్పులో కాలేశాడు'

Hardik Pandya's bizarre run out on Day 3 of India-South Africa, 2nd Test

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో పాండ్యా తప్పులో కాలేశాడు. తొలి టెస్టు మొదటి టెస్టుకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న పాండ్యా రెండో టెస్టుకు మాత్రం తడబడ్డాడు. సోమవారం రెండో టెస్టులో బ్యాటింగ్ తీసుకున్న కోహ్లీ సేన కాస్త కుదుర్చుకున్నా పాండ్యా మాత్రం రిలాక్స్‌డ్‌గా రన్నింగ్ చేస్తే రనౌట్ అయిపోయాడు.

దీంతో ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. క్రీజులోకి చేరుకున్నప్పటికీ కాలు మోపడానికి ఆలస్యం చేయడంతో ఫీల్డర్ వేసిన బంతి నేరుగా వికెట్లను తాకి రనౌట్‌కు గురి చేసింది. ఈ ఘటనకు పాండ్యాపై అభిమానులే కాదు.. మాజీ క్రికెట్లరు, క్రీడా పండితులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ పాండ్యా క్షమించరాని నేరం చేశాడని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ఎంతో విలువైన సమయంలో వృథాగా వికెట్ పారేసుకోవడం ఎంతమాత్రమూ సహించరానిదన్నాడు. ఇక నెటిజన్లు అయితే పాండ్యాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత చెత్తగా కూడా అవుటవుతారా? అంటూ నిలదీస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్ 68వ తొలి బంతికి సింగిల్ తీసే ప్రయత్నంలో పాండ్యా రనౌట్ అయ్యాడు. పరుగు కోసం ప్రయత్నించి విఫలమై వెనుదిరిగిన పాండ్యా క్రీజులోకి వచ్చినప్పటికీ బ్యాట్‌ను కానీ, పాదాన్ని కానీ మోపడంలో విఫలమయ్యాడు. ఈలోగా బంతి వికెట్లలోంచి దూసుకుపోయింది. పాండ్యా అవుటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 16, 2018, 9:00 [IST]
Other articles published on Jan 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X