న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈఎంఐ కట్టలేక.. కారు దాచిపెట్టా: ఐపీఎల్‌తో జీవితమే మారిందన్న పాండ్యా

By Nageshwara Rao
 Hardik Pandya Reveals How He Had To Hide His Car Because He Couldn't Pay EMI For 2 Years

హైదరాబాద్: హార్దిక్‌ పాండ్యా... భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూ అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతున్న యువ ఆటగాడు. అప్పుడు ఓ సామాన్య క్రికెటర్. అందరిలాగే అతడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో తమ జీవితం పూర్తిగా మారిపోయిందని బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌ అనే కార్యక్రమంలో చెప్పాడు.

అసలేం జరిగింది?: వెస్టిండిస్‌లో పాండ్యాను అరెస్ట్ చేయించబోయిన పొలార్డ్అసలేం జరిగింది?: వెస్టిండిస్‌లో పాండ్యాను అరెస్ట్ చేయించబోయిన పొలార్డ్

ఐపీఎల్‌లో అరంగేట్రం చేయకముందు ఆర్థికంగా తాను చాలా ఇబ్బందులు పడ్డానని, కనీసం కారు ఈఎంఐ కూడా కట్టలేక రెండేళ్లపాటు దానిని ఎవరికీ కనపడకుండా దానిని దాచేశానని చెప్పాడు. 'ఐపీఎల్‌కు ఎంపికయ్యే మూడేళ్ల ముందు చాలా ఇబ్బందులు పడ్డా. 5, 10 రూపాయలు కూడా ఎంతో జాగ్రత్తగా దాచి పెట్టుకునేవాళ్లం. ఐపీఎల్‌లో చాన్స్‌ దక్కిన తర్వాత రూ. 70వేలు కళ్లచూడడం ఇంకా గుర్తుంది' అని పాండ్యా అన్నాడు.

'కారు అంటే ఎంతో ఇష్టం ఉండడంతో వాయిదాల్లో కొన్నా. కానీ వాయిదాలు కట్టలేక రెండేళ్ల పాటు దాన్ని రోడ్డు మీదకే తీసుకు రాలేదు. కానీ కారును వదులుకోవడం ఇష్టంలేక దాన్ని దాచిపెట్టాం. ఆ సమయంలో మా ఆలోచనంతా ఈఎంఐ, తిండి చుట్టూనే తిరిగేది. బయటకు తెస్తే దాన్ని లాగేసుకుంటారని దాచేసేవాళ్లం. కారు ఈఎంఐ కట్టేందుకు డబ్బులు కూడబెడుతూ ఉండేవాళ్లం' అని తెలిపాడు.

'దేవుడు మేలు చేశాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత రూ.50 లక్షల చెక్కు అందుకున్నా. అప్పుడు నా కారుకు విముక్తి లభించింది. మరో కొత్త కారు కూడా కొనుక్కున్నా. మూడు నెలల కాలంలోనే నా జీవితం ఎంతో మారిపోయింది' అని ఐపీఎల్‌ అవకాశం రావడంతో జీవితం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 3, 2017, 10:17 [IST]
Other articles published on Dec 3, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X