న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్‌లానే నేను ఉంటా.. కపిల్‌, స్టోక్స్‌తో పోల్చుకోను!!

Hardik Pandya Quashes Comparisons With Kapil Dev & Ben Stokes

'ముంబై: ఆల్‌రౌండర్‌లు కపిల్‌ దేవ్, బెన్‌ స్టోక్స్‌తో నేను పోల్చుకోను. అత్యుత్తమంగా ఆడటానికే ప్రయత్నిస్తా. కేవలం హార్దిక్‌లానే నేను ఉంటా అని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అంటున్నాడు. జనవరి 1న తన ప్రేయసి నటాషాతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న హార్దిక్‌ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఇండియా టుడే 'ఇన్‌స్పిరేషన్‌' కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్‌ పాండ్యా పలు విషయాలను పంచుకున్నాడు.

బీబీఎల్‌లో మరో అద్భుతం.. కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న ఎల్లిస్‌ (వీడియో)బీబీఎల్‌లో మరో అద్భుతం.. కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న ఎల్లిస్‌ (వీడియో)

వారితో అసలు పోల్చుకోను:

వారితో అసలు పోల్చుకోను:

'భారత జట్టు కోసం పోరాడటమే నా బాధ్యత. హార్దిక్‌ ఎలా బ్యాటింగ్‌ చేశాడు?. గొప్ప ప్రదర్శన చేశాడా లేదా అని ఆలోచించను. నేను 10 పరుగులు చేసిన జట్టు విజయం సాధిస్తే ఎంతో ఆనందిస్తా. 30 పరుగులు చేసినపుడు ఓడితే ఎంతో బాధపడతా. ఆల్‌రౌండర్‌లు కపిల్‌ దేవ్ , బెన్‌ స్టోక్స్‌తో నేను ఎప్పుడూ పోల్చుకోను. అత్యుత్తమంగా ఆడటానికే ప్రయత్నిస్తా. జట్టు విజయాలే నా లక్ష్యం. హార్దిక్‌లానే నేను ఉంటా' అని పాండ్యా అన్నాడు.

జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితి:

జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితి:

'బాగా గుర్తుంది. ఆ 10 రోజులు (కాఫీ విత్‌ కరణ్‌) ఇంట్లోంచి బయటకే రాలేదు. సమస్యను ఎదుర్కోనే తీరు ఇదికాదని వారం, పది రోజుల తర్వాత అర్థమైంది. ఇది నా జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితి అని తెలుసుకున్నా. ఆపై నా దృష్టినంతా ఆటపైకి మళ్లించా. జరిగింది మర్చిపోయాను. ఆర్నెల్లు సస్పెండ్‌ చేస్తారా? తర్వాత మ్యాచులోనే ఆడిస్తారా అని పట్టించుకోలేదు' అని పాండ్యా తెలిపాడు.

వేగంగా కోలుకోవడం ఎంతో సంతోషం:

వేగంగా కోలుకోవడం ఎంతో సంతోషం:

'వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత ఎలా ఉన్నానో అని విరాట్‌ కోహ్లీ సందేశం పంపించాడు. బాగున్నాను కానీ ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి రాకూడదని బదులిచ్చా. మందులు వేసుకోవడం, కోలుకోవడం సవాల్‌గా అనిపించింది. 100 కేజీల బరువెత్తే నేను కనీసం కాలు కూడా కదపలేకపోయా. మన శరీరం సాధారణంగా 100% ప్రయత్నించేందుకు అలవాటై ఉంటుంది. కోలుకోవడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడ్డా' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

శంకర్‌కు అవకాశం:

శంకర్‌కు అవకాశం:

శనివారం నిర్వహించిన యోయో ఫిట్‌నెస్‌ పరీక్షలో హార్దిక్‌ విఫలమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ ప్రమాణాలకు తగిన విధంగా ఫిట్‌నెస్ టెస్టులో సాధించాల్సిన కనీస స్కోరును అందుకోలేకపోయాడు. దీంతో భారత్‌-ఎ జట్టు తరఫున ఎంపికైన అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపికచేశారు. అంతేకాదు న్యూజిలాండ్‌ పర్యటనకు అతని పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.

Story first published: Sunday, January 12, 2020, 18:46 [IST]
Other articles published on Jan 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X