న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1999 వరల్డ్‌కప్ హీరోతో హార్ధిక్ పాండ్యాను పోల్చిన స్టీవ్ వా

Hardik Pandya is The Lance Klusener of This World Cup 2019: Steve Waugh

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యాపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్‌​ వా ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యాను 1999 వరల్డ్‌కప్ హీరో దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్‌ క్లూసెనర్‌తో పోల్చాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా 27 బంతుల్లోనే 48 పరుగులు రాబట్టడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా ఇంతలా భారీ స్కోర్‌ చేయడానికి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ కారణమైంది.

స్టీవ్ వా మాట్లాడతూ

స్టీవ్ వా మాట్లాడతూ

ఈ నేపథ్యంలో స్టీవ్ వా మాట్లాడతూ "ఈ ప్రపంచకప్‌లో హార్దిక్‌ ఆటను చూస్తుంటే 1999 ప్రపంచకప్‌లో సఫారీ ఆల్‌రౌండర్‌ లాన్స్ క్లూసెనర్‌ గుర్తు కొస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎదుర్కొనే తొలి బంతి నుంచి చివరి బంతి వరకు హిట్టింగ్‌ చేయాలనే ఆడతారు ఇద్దరూ. పాండ్యా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఆత్మరక్షణలో పడతాడు" అని అన్నాడు.

పాండ్యా అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్

పాండ్యా అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్

పాండ్యా అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్. ఫోర్లు, సిక్సులను అలవోకగా బాదేయగలడు. 1999 వరల్డ్‌కప్‌లో క్లూసెనర్ కూడా అచ్చం అలానే ఆడాడు. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో క్లూసెనర్ 122.17 యావరేజితో 281 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు.

టీ20లు లేని కాలంలోనే

టీ20లు లేని కాలంలోనే

టీ20లు లేని కాలంలోనే అంత స్ట్రైక్‌ రేట్‌ మెయింటేన్‌ చేయడం మామూలు విషయం కాదని స్టీవ్‌వా చెప్పుకొచ్చాడు. ఎడ్జిబాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్లూసెనర్ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసి ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించి స్టీవ్ వా నాయకత్వంలోని ఆసీస్ వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా అవతరించింది.

బుధవారం పాక్‌తో మ్యాచ్

బుధవారం పాక్‌తో మ్యాచ్

ఇక, టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరుత్సాహరిచారని స్టీవ్ వా చెప్పాడు. ఫీల్డింగ్‌లో చేసిన చిన్నపాటి తప్పిదాలే మ్యాచ్‌ను దూరం చేశాయని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా ఆసీస్ బుధవారం పాక్‌తో తలపడనుంది.

{document1}

Story first published: Tuesday, June 11, 2019, 18:41 [IST]
Other articles published on Jun 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X