న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కాఫీ' వివాదం: అంబుడ్స్‌మన్‌ను కలిసి వివరణ ఇచ్చిన పాండ్యా

IPL 2019: Hardik Pandya Deposes Before BCCI Ombudsman Regarding Koffee Controversy | Oneindia Telugu
Hardik Pandya deposes before BCCI Ombudsman

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ ముందు హాజరయ్యాడు. టోర్నీలో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

జట్టు బస చేస్తున్న హోటల్‌లో

జట్టు బస చేస్తున్న హోటల్‌లో

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు బస చేస్తున్న హోటల్‌లో మంగళవారం జస్టిస్ డీకే జైన్‌ను కలిసిన హార్దిక్ పాండ్యా తన వాంగుల్మాన్ని ఇచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్ కోసం ముంబైకి చేరుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం అంబుడ్స్‌మన్‌ను బుధవారం కలవనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రముఖ వార్తా సంస్థ పీటీకి సమాచారమిచ్చింది.

సుప్రీం కోర్టు నియమించిన అంబుడ్స్‌మన్

సుప్రీం కోర్టు నియమించిన అంబుడ్స్‌మన్

సుప్రీం కోర్టు నియమించిన అంబుడ్స్‌మన్ జస్టిస్ జైన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు 'కాఫీ' వివాదంపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులకు అనుగుణంగానే వీరిద్దరూ హాజరు కాబోతున్నారు. వీరిద్దరి విచారణ నివేదికను సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కు జస్టిస్ జైన్ సమర్పిస్తారు.

బీసీసీఐ పాలకుల కమిటీ చర్యలు

బీసీసీఐ పాలకుల కమిటీ చర్యలు

నివేదికను అనుసరించి వీరిద్దరిపై బీసీసీఐ పాలకుల కమిటీ చర్యలు తీసుకోనుంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే వారిద్దరూ క్షమాపణలు తెలపడంతో పాటు, కొన్ని రోజులు క్రికెట్‌ ఆడకుండా నిషేధానికి కూడా గురయ్యారు.

'కాఫీ' వివాదానికి ముగింపు పలికాలని

'కాఫీ' వివాదానికి ముగింపు పలికాలని

దీంతో ఈ కాఫీ వివాదానికి ముగింపు పలికాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌, వరల్డ్‌కప్ దృష్ట్యా ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ ఏడాది జనవరి తొలి వారంలో ప్రసారమైన కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, April 10, 2019, 15:01 [IST]
Other articles published on Apr 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X