న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి మరియు ఏకైక కెప్టెన్ హార్దిక్ పాండ్యానే..!

Hardik Pandya Became the First and only Indian Captain to take a Wicket in T20Is

ఐర్లాండ్‌లోని డబ్లిన్ సమీపంలో ఉన్న ది విలేజ్‌లో జరిగిన ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టుపై టీమిండియా అలవోకగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఐర్లాండ్ పర్యటనలో జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో వికెట్‌ తీసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేశాడు.

అతను తన మొదటి ఓవర్‌లో ఐరిష్ కెప్టెన్‌‌ను అవుట్ చేశాడు. రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కు దిగాడు. అతని బౌలింగ్లో ఐర్లాండ్ సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ బౌండరీతో బాది హార్దిక్‌కు వెల్ కమ్ చెప్పాడు. రెండో బంతికి హార్దిక్ ఊరించే బంతి వేయడంతో స్టిర్లింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. స్టిర్లింగ్ ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ హుడా అందుకోవడంతో.. హార్దిక్ పాండ్యా భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో తొలి వికెట్ సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు.

టీ20 ఫార్మాట్లో తొమ్మిదో కెప్టెన్

టీ20 ఫార్మాట్లో తొమ్మిదో కెప్టెన్

ఇకపోతే హార్దిక్ పాండ్యా టీ20 ఫార్మాట్లో ఇండియాకు కెప్టెన్సీ వహించిన తొమ్మిదో ప్లేయర్. టీ20ల్లో వికెట్ సాధించిన తొలి మరియు ఏకైక భారత కెప్టెన్‌ కూడా. అంతకుముందు భారత టీ20 ఫార్మాట్లకు వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌ కెప్టెన్సీ వహించారు. ఈ కెప్టెన్లలో ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. టీ20ల్లో కోహ్లీ, రైనా, రోహిత్‌లు తమ వికెట్లు తీసినప్పటికీ.. వారు కెప్టెన్‌గా కాకుండా ప్లేయర్‌గా వికెట్లు తీశారు.

టీమిండియా లోయర్ ఆర్డర్లో హిట్టర్‌గా

టీమిండియా లోయర్ ఆర్డర్లో హిట్టర్‌గా

28ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు అద్భుతమైన కెప్టెన్సీ అందించాడు. అతను గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు టైటిల్‌ అందించేలా కెప్టెన్సీ చేశాడు. ఈ ఆల్‌రౌండర్ తన బ్యాటింగ్‌‌లో మరో కోణాన్ని కూడా చూపించాడు. అతను బ్యాటింగ్లో కీలక పాత్రను పోషించాడు. తమ జట్టు ప్లేయర్లు మరింత స్వేచ్ఛతో ఆడేలా వ్యవహరించాడు. అతను ఐపీఎల్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాక.. తన బ్యాటింగ్ శైలిని మళ్లీ మార్చుకున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ.. హిట్టింగ్ చేయడంలో విజయవంతం అవుతున్నాడు.

హార్దిక్ పాండ్యా 12బంతుల్లో 24తో చెలరేగడంతో..

హార్దిక్ పాండ్యా 12బంతుల్లో 24తో చెలరేగడంతో..

ఇకపోతే వర్షం వల్ల నిన్నటి మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించగా.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4వికెట్ల నష్టానికి 108పరుగులు చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ (1/16), యుజ్వేంద్ర చాహల్‌ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. కానీ హ్యారీ టెక్టార్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) ఐర్లాండ్ తరఫున రాణించి.. ఆ జట్టు స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అనంతరం దీపక్‌ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లతో 47 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 ) రాణించగా.. చివర్లో కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్‌లతో 24) చెలరేగడంతో భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Story first published: Monday, June 27, 2022, 16:09 [IST]
Other articles published on Jun 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X