న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా, జడేజా!!

Hardik Pandya and Ravindra Jadeja register 150 record partnership for 6th Wicket after 21 years
Ind vs Aus 2020,3rd ODI:Hardik Pandya,Jadeja Register Record Partnership For 6th Wicket In Australia

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసింది. టీమిండియా భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలే. 152 పరుగులకే కీలక 5 వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా.. ఒక దశలో 200 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆరో వికెట్‌కు పాండ్యా (92; 76 బంతుల్లో, 7×4, 1×6), జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6)లు కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. వీరిద్దరు కలిసి 6వ వికెట్‌కు 108 బంతుల్లోనే 150 పరుగులు జోడించారు.

21 ఏళ్ల తర్వాత:

21 ఏళ్ల తర్వాత:

1999లో ఆస్ట్రేలియాపై రాబిన్‌ సింగ్‌, శఠగోపన్‌ రమేశ్‌లు 6వ వికెట్‌కు 123 పరుగుల జోడించడం ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. తాజాగా ఆ రికార్డును 21 ఏళ్ల తర్వాత రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలు కలిసి సవరించారు. ఓవరాల్‌గా చూసుకుంటే పాండ్యా, జడేజా జోడి ఆసీస్‌పై చేసిన 150 పరుగుల భాగస్వామ్యంతో మూడవ స్థానంలో ఉంది. అంబటి రాయుడు, స్టువర్ట్‌ బిన్నీ కలిసి 2015లో జింబ్వాబేతో జరిగిన వన్డేలో 6 వికెట్‌కు 160 పరుగులు జోడించి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఎంఎస్ ధోనీ, యువరాజ్‌ సింగ్ జోడి రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరు కలిసి 2005లో జింబ్వాబేపై 6వ వికెట్‌కు 158 పరుగుల జోడించారు.

సెంచరీ చేసే అవకాశం వచ్చినా:

సెంచరీ చేసే అవకాశం వచ్చినా:

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హార్దిక్‌ పాండ్యా మరో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 76 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. పాండ్యాకు వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశం వచ్చినా.. ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజాకు ఎక్కువగా స్ట్రైక్‌ ఇచ్చాడు. దీంతో సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. మరోవైపు జడేజా చివర్లలో వీరవిహారం చేశాడు. 32 ఓవర్‌లో ప్యాండ్యాకు జత కలిసిన జడేజా యదేచ్చగా బ్యాట్‌ ఝులింపించాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.

 కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌:

కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌:

ఈ మ్యాచులో డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. కేవ‌లం 251 వ‌న్డేల్లో కోహ్లీ ఈ ఘ‌న‌త‌ను కైవ‌సం చేసుకున్నాడు. 242వ‌ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. వ‌న్డేల్లో కోహ్లీ బ్యాటింగ్ యావ‌రేజ్ 59.41గా ఉంది. కోహ్లీ వ‌న్డే ఖాతాలో 43 సెంచ‌రీలు ఉన్నాయి. ప‌రిమితి ఓవ‌ర్ల క్రికెట్‌లో త‌న‌కు సాటి లేద‌న్న రీతిలో కోహ్లీ త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.

India vs Australia: అరంగేట్రం అదిరిందయ్యా.. న‌ట‌రాజ‌న్ ఖాతాలో తొలి వికెట్!!

Story first published: Wednesday, December 2, 2020, 16:04 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X