వీడియో: ఆ న‌లుపుకోవ‌డ‌మేంట్రా బాబూ! కాఫీ విత్ క‌ర‌ణ్ ఎఫెక్టా? మీరేమైనా..?

బ‌ర్మింగ్‌హామ్‌: కాఫీ విత్ క‌ర‌ణ్‌. చాలాకాలంగా ఓ ప్రైవేటు ఛాన‌ల్‌లో టెలికాస్ట్ అవుతూ వ‌స్తోన్న టాక్ షో. బాలీవుడ్ అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జొహార్ దీన్ని హోస్ట్ చేస్తున్నారు. బోల్డ్‌గా మాట్లాడుకోవ‌టం ఈ టాక్ షో ప్ర‌త్యేక‌త‌. ఆ ప్ర‌త్యేక‌త వ‌ల్లే ఈ టాక్ షో కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్ప‌డ్డారు. మొన్నామ‌ధ్య ఈ టాక్ షోలో ఎంట్రీ ఇచ్చారు టీమిండియా క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, క‌న్న‌డిగుడు కేఎల్ రాహుల్‌. బోల్డ్ ప్రోగ్రామ్ క‌దా! అందుకే బోల్డ్‌గానే మాట్లాడేసుకున్నారు. మ‌న‌సు విప్పి మ‌రీ త‌మ అభిప్రాయాల‌ను చెప్పుకొన్నారు. అలా మాట్లాడ‌టం వ‌ల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏమిట‌నేది అంద‌రికీ తెలిసిందే. అది వేరే విష‌యం.

మ్యాచ్‌పై మ‌న‌సు పెట్ట‌కుండా..

మ్యాచ్‌పై మ‌న‌సు పెట్ట‌కుండా..

ఇంకా దాని ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డ‌న‌ట్టుంది హార్దిక్ పాండ్యా. అందుకే- `తోడు` వెదుక్కున్నాడ‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు- హార్దిక్ పాండ్యా, కేదార్ జాద‌వ్ వివాదాస్పదంగా ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రి చేతుల‌ను ఒక‌రు న‌లుపుకొంటూ క‌నిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వారి ప్ర‌వ‌ర్త‌న‌ను ద‌నుమాడుతున్నారు ట్విట్ట‌రెట్టీలు. సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు నెటిజ‌న్లు. బ‌హిరంగంగా, కెమెరాలు ఉన్నాయ‌నే భ‌యం కూడా లేకుండా `అలా` ప్ర‌వ‌ర్తించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

వీడియో: రిష‌బ్ పంత్‌ నాలుగో స్థానంలో ఆడ‌టంపై రోహిత్ శ‌ర్మ చురకలు!

కేప్టెన్ చెప్పేది ప‌ట్టించుకోకుండా..

కేప్టెన్ చెప్పేది ప‌ట్టించుకోకుండా..

అస‌లే ప్ర‌పంచ‌క‌ప్‌. పైగా టీమిండియా మాంఛి దూకుడు మీద ఉంది. ఇంగ్లండ్‌కు చావో, రేవో తేలాల్సిన మ్యాచ్ అది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైన‌ల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవ‌డానికి ఇంగ్లండ్‌కు గ‌ల అవ‌కాశాలు చాలావ‌ర‌కు మెరుగుప‌డ‌తాయి. అలాంటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ త‌న స‌హ‌చ‌ర జ‌ట్టు స‌భ్యుల‌కు సూచ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో- ఈ దృశ్యం క‌నిపించింది. టీమిండియా కేప్టెన్ ఇస్తోన్న సూచన‌లు, స‌ల‌హాల‌ను ప‌ట్టించుకోకుండా త‌మ లోకంలో తాము మునిగిపోయి, చేతులు న‌లుపుకోవ‌డంపై పెట్టారు త‌మ ధ్యాస అంతా అని నెటిజ‌న్లు ఆరోపిస్తున్నారు.

కొత్త తోడు దొరికిందా?

కొత్త తోడు దొరికిందా?

సాధార‌ణంగా- మ్యాచ్‌కు ముందు ఏ జ‌ట్టు కేప్టెన్ అయినా గానీ.. స‌హ‌చ‌రులతో గుంపు క‌డ‌తాడు. మ్యాచ్‌లో ఎలా ఆడాలి? ప‌్ర‌త్య‌ర్థిని ఎలా క‌ట్డి చేయాలి? వారి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలి? అనే కీల‌క‌మైన అంశాల‌పై చర్చిస్తాడు. తోటి ఆట‌గాళ్ల‌లో స్ఫూర్తిని నింపుతాడు. ఎలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను గెలిచి తీరేలా ప‌ట్టుద‌ల‌ను ప్రేరేపిస్తాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముందు- విరాట్ కోహ్లీ అదే ప‌నిచేశాడు. జ‌ట్టు స‌భ్యులంద‌ర్నీ ఓ చోట‌కి పిలిపించాడు. ఒక‌రి భుజాల‌పై ఒక‌రు చేతులు వేసి, కేప్టెన్ చెప్పేది శ్ర‌ద్ధ‌గా ఆల‌కిస్తున్న స‌మ‌యంలో- హార్దిక్ పాండ్యా, కేదార్ జాద‌వ్ చిలిపి చేష్ట‌లకు దిగారు. దీన్ని గ‌మ‌నించిన కెమెరామెన్ వారి చేష్ట‌ల‌పైనే ఫోక‌స్ చేశాడు. ఈ వీడియో వెలుగులోకి రాగానే సోష‌ల్ మీడియాలో వారిద్ద‌రి చేష్ట‌ల‌పై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 1, 2019, 13:57 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X