న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Harbhajan Singh: టీమిండియాకు అతను ఛాయిస్ కాదు అవసరం

Harbhajan suggests selecting Dinesh Karthik in the finisher role for Team India

ఐపీఎల్ 2022 ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి అవకాశం ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఫామ్‌లో లేనప్పటికీ ఆర్సీబీ టీంలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనర్‌గా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయంలో పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కూడా 13మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టి జట్టు బౌలింగ్ లైనప్లో కీలక ప్లేయర్‌గా మారాడు. అలాగే పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్‌తో సమానంగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున మరో కీలక ప్లేయర్ దినేష్ కార్తీక్. అతను బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్లో జట్టుకు సమతూకం తెస్తూ ఫినిషర్ రోల్ నిర్వహిస్తున్నాడు.

భీకరమైన స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్

భీకరమైన స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్

ఐపీఎల్ 2022లో 13మ్యాచ్‌ల్లో 285పరుగులతో ఆర్సీబీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కార్తీక్. అతను ఈ పరుగులు లోయర్ ఆర్డర్లో చేయడం గమనార్హం. ఇన్నింగ్స్ ముగిసే క్రమంలో, ఛేజింగ్ టైంలో కార్తీక్ ఈ రన్స్ చేశాడు. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్, ఫినిషర్ పాత్రను దినేష్ కార్తీక్ పోషిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో ఎనిమిది సార్లు నాటౌట్‌గా నిలిచిన కార్తీక్.. 57.00సగటుతో స్కోరు చేశాడు. అతని స్ట్రైక్-రేట్ సైతం భీకరంగా ఉంది. 192.57 స్ట్రైక్ రేట్‌తో అతను పరుగులు చేయడం గమనార్హం.

 ఈ సీజన్లో నా అభిప్రాయం ప్రకారం అతనే అత్యుత్తమ ఫినిషర్

ఈ సీజన్లో నా అభిప్రాయం ప్రకారం అతనే అత్యుత్తమ ఫినిషర్

అత్యుత్తమ గణాంకాలు, ప్రదర్శనతో దినేష్ కార్తీక్ ఈ సీజన్లో ఆడుతుండడంతో అతను తిరిగి టీమిండియా తరఫున ఆడడం ఖాయమనే విశ్లేషణలు ఎక్కువయ్యాయి. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కార్తీక్‌కు మద్దతుగా అతను టీమిండియాలో ఆడాలని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్‌లో గేమ్‌ప్లాన్ ఎపిసోడ్ సందర్భంగా హర్భజన్ మాట్లాడుతూ.. ఆర్సీబీ జట్టులో దినేష్ కార్తీక్ అత్యుత్తమ ప్లేయర్‌గా ఉన్నాడు. అతను ఆఫ్ సైడ్‌ల కంటే లెగ్ సైడ్ షాట్‌లలో చాలా ప్రావీణ్యం కనబరుస్తున్నాడు. సింగిల్స్ కూడా చాలా చక్కగా తీస్తున్నాడు. మ్యాచ్‌ను బాగా అర్థం చేసుకుంటున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫినిషింగ్ చేయడంలో చాలా సమర్థంగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఎవరైనా ఫినిషర్‌గా అత్యుత్తమ పాత్ర పోషించినట్లయితే అది దినేష్ కార్తీక్ అనే చెబుతాను' అని హర్భజన్ పేర్కొన్నాడు.

టీమిండియాకు వారిద్దరు అవసరం

టీమిండియాకు వారిద్దరు అవసరం

ఇంకా హార్భజన్ మాట్లాడుతూ.. నేను సెలెక్టర్‌ అయినట్లయితే ప్రపంచ‌కప్ టీ20 కోసం అతనికి ఆస్ట్రేలియా ఫ్లైట్ టిక్కెట్ ఇప్పిస్తాను. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా అతన్ని టీమిండియా తరఫున ఆడించాలి. అతను టీమిండియాలో ఆడేందుకు అర్హుడు. టీమిండియాకు ఇప్పుడు అత్యుత్తమ ఫినిషర్ అవసరం గనుక దినేష్‌ కార్తీక్ జట్టులో ఉండాలి. కార్తీక్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉంటే జట్టు దుర్భేద్యమవుతుంది. ఏదేమైనా దినేష్ మాత్రం ఈ సీజన్లో తన అసలు సత్తాను చూపుతున్నాడని మాత్రం చెబుతాను అని భజ్జీ పేర్కొన్నాడు.

Story first published: Saturday, May 14, 2022, 14:42 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X