న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దక్షిణాఫ్రికా టూర్‌లో రోహిత్ శర్మకు ఆరో స్థానం కల్పించాలి'

Harbhajan Singh wants Rohit Sharma to be picked as no 6 batsman

హైదరాబాద్: దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా ఆతిథ్య భారత్ ముందుగా మొదలుకానున్న టెస్ట్ సిరీస్‌ను గెలవాలనే బలమైన పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. 2018లో జరగబోతున్న ఈ మ్యాచ్‌కి గాను ఇప్పటికే క్రీడాకారుల జాబితా విడుదల చేసింది. జట్టులో ఆరో స్థానం కీలకం కాగా ఆ స్థానాన్ని రోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా భర్తీ చేయగలడంటూ హర్జజన్ సింగ్ పేర్కొన్నాడు.

ఈ ఆరో స్థానానికి సరిపడ మరో వ్యక్తి హార్ధిక్ పాండ్యా. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ పోలుస్తూ ఒకవేళ తన పాత ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగితే హార్ధిక్ పాండ్యా సరిపోతాడు. కానీ, రోహిత్ శర్మ వన్డేలతో పాటుగా టీ 20ల్లోనూ మంచి ఫామ్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ కీలకమైన ఆరో స్థానం రోహిత్ శర్మకి ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

రోహిత్ ఒక అద్భుతమైన ఆటగాడు. పుల్ షాట్, కట్ షాట్‌ను రెండింటినీ ఆడగల వ్యక్తులలో అతను ఒకడు. ఈ ఏడాది 2017 లో అతను మంచి ఫామ్‌ను కలిగి ఉన్నాడు. దక్షిణాఫ్రికా‌లో తికమక పెట్టే బౌలర్లకు అతను మంచి సమాధానం చెప్పగలడు. డేల్ స్టేన్ , మార్న్ మార్కెల్‌లు వేసే బంతులను సునాయాసంగా ఎదుర్కోగలడు అని తెలిపాడు.

భారత జట్టు ఆటగాళ్లైన మురళీ విజయ్, పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మ మంచి ఆటగాళ్లు. ప్రపంచ స్థాయి ఆటకు వీరు గట్టి పోటీనివ్వగలరని అభిప్రాయపడ్డాడు.

భారత్ జనవరి 5నుంచి దక్షిణాఫ్రికాతో న్యూలాండ్స్‌లోని కేప్ టౌన్‌లో జరగనున్న మొదటి టెస్ట్‌లో
ఆడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 9:44 [IST]
Other articles published on Dec 27, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X