న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువీ.. టైంకి కరెంట్ బిల్లు కడితే ఇన్ని తిప్పలుండవ్: హర్భజన్

Harbhajan Singh Ensures Medical Help To Save Ex-Cricketer's Life
Harbhajan Singh Trolls Yuvraj Singh Over Electricity Bill

హైదరాబాద్: సింగ్ ద్వయం హర్భజన్, యువరాజ్‌లు కలిసి ఆడిన మ్యాచ్‌లు ఎన్నో.. వీరిద్దరీ కలయికలో మ్యాచ్ ఉందంటే దాదాపు సంచలనమే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో వేలం జరుగుతున్న సమయంలో యువరాజ్ సింగ్‌ను కొనుగోలు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున హర్భజన్‌తో కలిపి ప్రత్యర్థులుగానూ కొన్ని మ్యాచ్‌లు ఆడారు. ఇదిలా ఉంటే, యువరాజ్ సింగ్ సరదాగా చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముంబైలోని బాంద్రాలో యువరాజ్ సింగ్ ఇంట్లో అనుకోకుండా కరెంట్ పోయింది. ఇలా దాదాపు ఓ గంటపాటు గడపాల్సి వచ్చిందట.

దాంతో.. యువరాజ్ 'గంట నుంచి ఈ ప్రాంతంలో లైట్లు లేకుండా పోయాయ్.. ఎవరైనా కరెంటు తీసుకురాగలరా ?!?! 😐' అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు హర్భజన్ సింగ్ క్షణం ఆలస్యం చేయకుండా చూసిన వెంటనే, బాద్‌షా కరెంట్ బిల్లు టైంకి చెల్లిస్తే సరిపోతుంది. అప్పుడందరినీ అడగాల్సిన అవసరముండదు' అని బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణ సరదాగానే జరిగిన అభిమానులకు మాత్రం ఇది చర్చనీయాంశంగానే మారింది.

ఈ ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హర్భజన్ సింగ్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో అతణ్ని ఫైనల్ మ్యాచ్‌తో పాటుగా మరికొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్ ధోనీ తప్పించాడు. కాగా, మే 27న ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఇక యువరాజ్ సింగ్ విషయానికొస్తే.. వేలంలో ప్రారంభ ధరకే కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే అతణ్ని బరిలోకి దింపింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో యువీని కొన్ని మ్యాచ్‌ల నుంచి తప్పించారు. అతనేమీ పరుగులు చేయకపోయినా జట్టులో లేనప్పటి నుంచి పరాజయాల పరంపర మొదలైంది. దీంతో మళ్లీ జట్టులోకి తీసుకున్నా బౌలింగే ప్రధాన బలంగా దూసుకెళ్లిన పంజాబ్ జట్టు ద్వితీయార్థంలో చతికిలబడి లీగ్ దశ నుంచే నిష్క్రమించింది.

Story first published: Wednesday, June 6, 2018, 16:35 [IST]
Other articles published on Jun 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X