న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్ ఎత్తేది కేవలం 40 కిలోలేనా?.. రోహిత్‌ను ట్రోల్ చేసిన హర్భజన్‌!!

Harbhajan Singh Hilariously Trolls Rohit Sharma On Workout Video | Oneindia Telugu
Harbhajan Singh Trolls Rohit Sharma over Workout Video

ముంబై: టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మకు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో పిక్క గాయం అయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అవ్వడంతో కివీస్ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్‌మ్యాన్‌.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. మరోవైపు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

చెతేశ్వర్‌ పుజారా రీ ఎంట్రీ.. గ్లౌస్టర్‌షైర్‌తో ఒప్పందం!!చెతేశ్వర్‌ పుజారా రీ ఎంట్రీ.. గ్లౌస్టర్‌షైర్‌తో ఒప్పందం!!

కేవలం 40 కిలోలేనా?:

కేవలం 40 కిలోలేనా?:

గాయం తర్వాత రోహిత్‌ శర్మ తొలిసారి జిమ్‌లో కసరత్తులు చేశాడు. జిమ్‌లో అధిక బరువులెత్తుతూ ఫిట్‌నెస్‌ కోసం కష్టాలు పడుతున్నాడు. కసరత్తులు చేస్తున్న వీడియోను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌.. హిట్‌మ్యాన్‌ను సరదాగా ట్రోల్‌ చేశాడు. 'ఇందుకోసం కేవలం 40 కిలోలేనా? కమాన్‌ షానా' అని హర్భజన్‌ కామెంట్ పెట్టాడు.

 బరువులెత్తడం ఇదే తొలిసారి:

బరువులెత్తడం ఇదే తొలిసారి:

హర్భజన్‌ సింగ్ కామెంట్‌కు రోహిత్‌ శర్మ మర్యాద పూర్వకంగా బదులిచ్చాడు. 'గాయం అయిన తర్వాత బరువులెత్తడం ఇదే తొలిసారి. అందుకే ఇలా తక్కువ బరువులెత్తా' అని రోహిత్‌ రాసుకొచ్చాడు. భజ్జీ, హిట్‌మ్యాన్‌ ట్వీట్లు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. భజ్జీ వ్యాఖ్యలకు సీరియస్‌గా తీసుకున్న కొందరు ఘాటుగా స్పందించారు.

100 నుంచి 200కు 32 బంతుల్లోనే:

100 నుంచి 200కు 32 బంతుల్లోనే:

'40 కిలోలే ఎత్తినా రోహిత్ బంతిని స్టాండ్స్‌లోకి తరలించగలడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'పాజీ.. రోహిత్ వాంఖడే నుంచి చిన్నస్వామికి బంతిని పంపించగలడు' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. '100 నుంచి 200కు 32 బంతుల్లోనే చేరుకోగలడు. నెమ్మదిగా ఆరంభిస్తాడు', 'బరువులెత్తడంలో డబుల్‌ సెంచరీ చేయాలా?', 'రోహిత్‌ గాయపడ్డాడు', 'ఇన్నింగ్స్ లాగే బరువులెత్తుతాడులే' అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో పునరాగమనం:

దక్షిణాఫ్రికా సిరీస్‌లో పునరాగమనం:

ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌ శర్మ మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టులో లేకపోవడం కివీస్‌కు సానుకూలాంశంగా మారింది. హిట్‌మ్యాన్‌ జట్టులో ఉంటే వన్డే సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Thursday, February 20, 2020, 10:34 [IST]
Other articles published on Feb 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X