అసలేం జరిగింది?: హర్భజన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

Posted By:

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. వివరాల్లోకి వెళితే... పంజాబీలో పెళ్లైన మహిళలు పవిత్రంగా జరుపుకునే 'కర్వా చౌత్' పండుగ సందర్భంగా భజ్జీ తన భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశాడు.

'కర్వా చౌత్‌ శుభాకాంక్షలు గీతా బస్రా. నేను బానే ఉన్నా.. ఆకలిగా ఉంటుంది తినండి' అని తన భార్య ఫోటోతో హర్భజన్ సింగ్ కామెంట్ పెట్టాడు. దీనిపై కొందరు అభిమానులు భజ్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఈ మూడనమ్మకాన్ని పంజాబీలు ఇంకా పాటించడం బాధగా ఉంది. శ్రీ గురు గ్రాంత్‌ సాహిబ్‌జీ ప్రకారం ఇది ఒక మూఢాచారమని ఒకరు కామెంట్‌ చేయగా.. భజ్జీ సిక్కిసమ్‌ను బోధిస్తున్నాడు' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే భజ్జీ చేసిన ట్వీ‌ట్‌కు మరికొందరు మద్దతుగా నిలివడం విశేషం.

'పంజాబీల గురించి మీకు అవగాహనలేకుంటే మాట్లాడకండి' మరో అభిమాని ట్వీట్ చేశాడు. ఇక హర్భజన్‌ కూడా నెటిజన్లకు 'మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి. మంచిగా ఉండటమే అతి పెద్ద మతమని' దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు.

ఇక కర్వా చౌత్ విషయానికి వస్తే కార్తీక పౌర్ణమి తర్వాతి నాలుగవ రోజున ఈ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు జరుపుకుంటారు. తమ భర్తలు ఆయు, ఆరోగ్యాల కోసం ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేసి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేయడం వలన తమ భర్త ఆయు, ఆరోగ్యాలతో ఉంటారని వారి విశ్వాసం. తమ భర్తను జల్లెడ చాటున చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

Story first published: Tuesday, October 10, 2017, 12:41 [IST]
Other articles published on Oct 10, 2017
Please Wait while comments are loading...
POLLS