న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా, రాహుల్‌లతో టీమ్‌ బస్సులో కూడా ప్రయాణించను: క్రికెటర్ల పరువు తీశారన్న భజ్జీ

Harbhajan Singh Slams Hardik Pandya, KL Rahul | Oneindia Telugu
 Harbhajan Singh slams Hardik Pandya, KL Rahul for jeopardising reputation of cricketers

హైదరాబాద్: 'కాఫీ విత్‌ కరణ్‌' టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ను వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. వారితో కలిసి ఒకే టీమ్‌ బస్సులో ప్రయాణించలేనని, తనతో తన భార్యా, కూతురు ఉంటారని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

వారిద్దరూ క్రికెటర్ల గౌరవాన్ని వారు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ టాక్ షోలో హార్ధిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు జట్టు సంస్కృతిపై సందేహాలు వ్యక్తం చేసేలా ఉన్నాయని అన్నాడు.

భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ

భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ "రేపు పొద్దున ఏ పార్టీలోనైనా వారిని కలిస్తే మీరు మాట్లాడుతారేమో కానీ.. నేను మాత్రం మాట్లాడను. అలాగే ఒకే టీమ్‌ బస్సులో కూడా నేను వారితో ప్రయాణించలేను. ఎందుకుంటే నాతో నా భార్య, కూతురు ఉంటుంది. హర్దిక్‌ ప్రతి ఒక్కరి గౌరవాన్ని తీసేలా ప్రవర్తించాడు" అని అన్నాడు.

మా మిత్రులతోనూ చర్చించం

మా మిత్రులతోనూ చర్చించం

"మేం ఇలాంటివి కనీసం మా మిత్రులతోనూ చర్చించం. వారు టీవీల్లో కనిపిస్తారు. ఇప్పుడు ప్రజలు హర్భజన్‌ సింగ్‌ ఇలాంటోడు, అనిల్‌ కుంబ్లే అలాంటోడు, సచిన్‌ ఇలాంటివాడు అనుకునే ప్రమాదం ఉంది" అని భజ్జీ అన్నాడు. ఎక్కువ మంది మహిళలతో కలవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పినట్టు పాండ్య షోలో నోరుజారిన సంగతి తెలిసిందే.

గదుల్లో పని కానిచ్చేశారా?

గదుల్లో పని కానిచ్చేశారా?

"మరి మీ జట్టు సహచరుల గదుల్లో పని కానిచ్చేశారా?" అని షోలో కరణ్‌ ప్రశ్నించగా రాహుల్‌, పాండ్య సానుకూలంగా స్పందించారు. దీని భజ్జీ "అంతగా ఖాళీగా ఉంటే నీకేం కావాలో దానిపై దృష్టి పెట్టాలి. ఖాళీ సమయాల్లో ఏ ఆటగాడు ఏం చేస్తుండో కనిపెట్టాల్సిన అవసరం అవినీతి నిరోధక యూనిట్‌ (ఏసీయూ)కు ఉంది. ఆటగాళ్లు ఈ తరహా నోరు జారకుండా నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. భారత జట్టుకు ఓ గౌరవం ఉంది" అని అన్నాడు.

గౌరవాన్ని చెడగొట్టారు

గౌరవాన్ని చెడగొట్టారు

"ఆ గౌరవాన్ని ఈ తరహా వ్యాఖ్యలతో వీరు చెడగొట్టారు. క్రికెట్‌ ఆడే ప్రతి సీనియర్‌కు, జట్టుకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. అసలు జట్టు సంస్కృతి గురించి అసభ్యకరంగా మాట్లాడానికి పాండ్య ఎంత కాలం నుంచి జట్టులో ఉంటున్నాడు? వారిపై ఇలా కఠినంగా వ్యవహరించడమే మంచిది. తాను గత 25 ఏళ్ల నుంచి క్రికెట్‌ ఆడుతున్నానని, ఇతరుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు" అని భజ్జీ అన్నాడు

బీసీసీఐ సరైన పనే చేసింది

బీసీసీఐ సరైన పనే చేసింది

"బీసీసీఐ సరైన పనే చేసింది. వేటు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. విరాట్‌ కోహ్లీ కూడా జట్టంతా వారితో కలిసుండాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు" అని హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్‌కు తిరుగు పయనం కానున్నారు.

విచారణను ఎదుర్కోనున్న రాహుల్, పాండ్యా

విచారణను ఎదుర్కోనున్న రాహుల్, పాండ్యా

ఈ ఇద్దరిపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్‌కు తిరిగొచ్చి వీరిద్దరూ విచారణను ఎదుర్కోనున్నారు. తొలుత ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని భావించినప్పటికీ... చివరికు విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నామని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.

Story first published: Saturday, January 12, 2019, 10:09 [IST]
Other articles published on Jan 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X