న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ సింగ్‌తో షాహిద్ అఫ్రీదిని పోల్చిన భజ్జీ, వాట్సన్‌లు

Harbhajan Singh, Shane Watson Compare Yuvraj Singh With Shahid Afridi

హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్, సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్‌ను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అఫ్రిదితో పోలుస్తూ హర్భజన్ సింగ్ వార్తల్లో కెక్కాడు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'భజ్జీ బ్లాస్ట్' షోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ రాగా.. ఇద్దరి మధ్య వయసుకి సంబంధించిన చర్చ మొదలైంది. దీంతో వారిద్దరూ కలిసి యువరాజ్‌ సింగ్‌ను పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో పోల్చారు. పీఎల్‌-11 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన హర్భజన్‌ సింగ్(37)‌, షేన్‌ వాట్సన్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణే అందుకు కారణం.

2001లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు నీ వయసెంత అని భజ్జీని అడగగా.. 18 అని వాట్సన్‌కు చెప్పాడు. నేను అడిగింది నీ కెరీర్‌ వయసు కాదని, కేవలం నీ వయసు మాత్రమేనంటూ వాట్సన్‌ భజ్జీపై జోక్‌ పేల్చాడు. దీంతో భజ్జీ గట్టిగా నవ్వేశాడట. నువ్వు అఫ్రిది(38)తో క్రికెట్‌ ఆడావా.. అతడిని దగ్గరగా గమనించావా అని వాట్సన్‌ను అడిగాడు. కొన్నేళ్లుగా అఫ్రిదిని గమనిస్తున్నాను, గత ఏడేళ్లుగా అతడి వయసు 36 ఏళ్లు మాత్రమేనంటూ వాట్సన్‌ చమత్కరించాడు.

హర్భజన్‌, యువరాజ్‌ సింగ్‌ చాలాకాలం కలిసి క్రికెట్‌ ఆడారట. అండర్‌-14, అండర్‌-16, అండర్‌-19 జట్లలో యువీతో కలిసి ఆడానని భజ్జీ చెప్పుకొచ్చాడు. భజ్జీని యువీ కంటే పెద్దవాడని కామెంట్‌ చేస్తున్నారని వాపోయాడు. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ.. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో మా జట్టుపై యువీ 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడని, ఆపై ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ యువీ అద్భుతంగా ఆడాడని ఆసీస్‌ క్రికెటర్‌ వాట్సన్‌ గుర్తు చేశాడు.

దానికి స్పందించిన భజ్జీ.. అయితే యువరాజ్‌ కూడా అఫ్రిది లాంటివాడేనంటూ గట్టిగా నవ్వేశాడు. కాగా, హర్భజన్‌, యువీలు ప్రస్తుతం జట్టులో చోటు కోసం యత్నిస్తున్నారు. వాట్సన్, భజ్జీల మధ్య సంభాషణ ప్రశ్న-జవాబుల రూపంలో..


వాట్సన్: 2001లో ఆస్ట్రేలియా పర్యటనకి వచ్చినప్పుడు మీ వయసు ఎంత..?

హర్భజన్: 18 సంవత్సరాలు


వాట్సన్: అది మీ అప్పటి వయసా లేక అప్పటికి మీరు క్రికెట్‌లోకి వచ్చి 18ఏళ్లు అయ్యిందా..? (నవ్వుతూ)

హర్భజన్: మీరు అఫ్రిదితో చాలా సమయం గడిపినట్లున్నారు..?


వాట్సన్: అవును.. అఫ్రిది వయసు గత ఏడేళ్లుగా.. 36 ఏళ్లే. ఇది చాలా గొప్ప విషయం

హర్భజన్: మీకొకటి చెప్తాను. యువరాజ్ సింగ్, నేను చాలా ఏళ్లపాటు క్రికెట్ ఆడాం. అండర్- 14, అండర్- 16, అండర్- 19లో కలిసి ఆడాము. కానీ.. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అయిపోయింది. కానీ.. యువరాజ్ మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడు.


వాట్సన్: అండర్-19 ప్రపంచకప్ సమయంలో యువరాజ్‌ సింగ్‌కి నేను ప్రత్యర్థిగా ఆడాను. ఆ టోర్నీలో అతను కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాది కెన్యాలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. ప్రత్యర్థులపై యువీ ఆధిపత్యం చెలాయిస్తుంటాడు.

హర్భజన్ సింగ్: అవును.. యువరాజ్ సింగ్ కూడా అఫ్రిదిలానే..!! (వయసు గురించి నవ్వుతూ)

Story first published: Thursday, June 7, 2018, 16:56 [IST]
Other articles published on Jun 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X