న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

47వ పడిలోకి గంగూలీ: ఆకట్టుకుంటోన్న సెహ్వాగ్ స్పెషల్ ట్వీట్

Happy Birthday to 56” Captain: Sehwag Steps up His Twitter Game on Gangulys Special Day

హైదరాబాద్: సౌరవ్ గంగూలీ... భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న టీమిండియాకు ఊపిరిపోసిన కెప్టెన్. అంతేకాదు మైదానంలో టీమిండియాను తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేసిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ సోమవారం 47వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1972 జూలై 8న జన్మించిన గంగూలీ పూర్తి పేరు సౌరవ్‌ చండీదాస్‌ గంగూలీ. అభిమానులు ముద్దుగా పిలుకునే పేరు దాదా. 1992లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. తన దూకుడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ-అజారుద్దీన్‌ల మధ్య గొడవ గంగూలీకి టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని కల్పించింది.

1996లో తొలి టెస్టు

1996లో తొలి టెస్టు

1996లో ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సౌరవ్ గంగూలీ ఎంపికయ్యాడు. అయితే, ఆ సిరిస్‌లో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ-అజారుద్దీన్‌ల గొడవ జరగడంతో... ఉన్నపళంగా సిద్దూ స్వదేశం తిరుగు పయనమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ... లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ సాధించాడు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం భారత్‌ క్రికెట్‌పై పెనుప్రభావం చూపింది. ఫిక్సింగ్‌ ఆరోపణలతో చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో దాదా ఆ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. గంగూలీ నాయకత్వంలోనే భారత్‌ 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరింది.

2003 ప్రపంచకప్‌లో

2003 ప్రపంచకప్‌లో

ఈ టోర్నీలో గంగూలీ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా 3 సెంచరీలతో 465 పరుగులు చేసి కీలకపాత్ర పోషించాడు. ఇక, ఇంగ్లాండ్ నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పిన సంఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా నెగ్గింది.

2005లో ఫామ్‌ కోల్పోవడంతో

2005లో ఫామ్‌ కోల్పోవడంతో

సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా 2001లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, 2002లో జింబాంబ్వే, వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌లను నెగ్గింది. ఆ తర్వాత గంగూలీ 2005 ఫామ్‌ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు కెప్టెన్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత దాదా పాక్‌పై 2011లో తన ఆఖరి వన్డేని ఆడాడు.

గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ ట్వీట్స్ మీకోసం...

Story first published: Monday, July 8, 2019, 12:55 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X