న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేవదర్ ట్రోఫీలో విహారీ హవా కొనసాగుతూనే ఉంది!!

Hanuma Vihari, spinners take India B to Deodhar Trophy final

హైదరాబాద్: టీమిండియాలో చోటు దక్కించుకోవడం కోసం.. ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడం కోసం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతోన్న యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్ హనుమ విహారి వీరవీహారం కొనసాగుతోంది. జాతీయ జట్టులో చోటు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఆంధ్ర క్రికెటర్...దేవదర్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ బి.. భారత్ సిపై 30 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత విహారి(94 బంతుల్లో 76, 6ఫోర్లు) హాఫ్ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 231/9 స్కోరు చేసింది. 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో అంకుశ్ బైన్స్(25)తో కలిసి విహారి జట్టును ఆదుకున్నాడు.

వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లతో ఆకట్టుకున్న ఆంధ్ర క్రికెటర్.. జట్టును గౌరవప్రదమైన స్కోరును కట్టబెట్టడంలో కీలకమయ్యాడు. రజ్‌నీశ్ గుర్బానీ(3/38), పప్పు రాయ్(3/45)మూడు వికెట్లతో రాణించగా, శంకర్(2/44) రెండు వికెట్లు తీశాడు. తర్వాత 232 పరగుల లక్ష్యఛేదనకు దిగింది భారత్ సి.

ఈ క్రమంలో 48.2 ఓవర్లలో కృష్ణప్ప గౌతమ్(3/40), మనోజ్ తివారీ(3/44), దీపక్ చాహర్(2/36) విజృంభణతో సూర్యకుమార్ యాదవ్(39), శుభ్‌మన్‌గిల్(36), విజయ్‌శంకర్(35), కెప్టెన్ రహానే(32) ఫర్వాలేదనిపించినా..నదీమ్(10-1-29-0) పొదుపైన బౌలింగ్‌తో భారత్ సి బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశాడు. గురువారం భారత్ ఎ, భారత్ సి మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Story first published: Thursday, October 25, 2018, 12:26 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X