న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదు.. ఇప్పుడు నేను చేస్తుంది ఏమాత్రం సరిపోదు: విహారి

 Hanuma Vihari said Never Imagined Getting Hospital Bed Would Be So Difficult for Covid patients
Hanuma Vihari : కుదిరితే ఓపెనింగ్ చేస్తా.. బౌలింగ్ కూడా | India Tour Of England || Oneindia Telugu

లండన్: దేశంలో ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. దేశంలో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన వేళ.. తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు విహారి సాయం చేస్తున్నాడు. పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందజేస్తున్నాడు.

WTC Final:కోహ్లీ నంబర్ వన్ గేమ్ ఛేంజర్‌ అయినా..న్యూజిలాండ్‌కి అసలైన ప్రమాదం No 2తోనే:మంజ్రేకర్WTC Final:కోహ్లీ నంబర్ వన్ గేమ్ ఛేంజర్‌ అయినా..న్యూజిలాండ్‌కి అసలైన ప్రమాదం No 2తోనే:మంజ్రేకర్

విహారి మంచి మనసు:

విహారి మంచి మనసు:

ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న హనుమ విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా.. వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఈ తెలుగు క్రికెటర్‌.. తన బృందం చేస్తున్న సేవ గురించి, రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు మరికొన్ని విషయాలపై మాట్లాడాడు.

ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదు:

ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదు:

'దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతితో అల్లాడుతోన్న ప్రజలను చూస్తుంటే బాధగా ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స కోసం పడక కూడా దొరకని పరిస్థితి తలెత్తుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదు. ఈ సంక్షోభ సమయంలో నా వంతు సాయంగా మిత్రులు, సామాజిక మాధ్యమాల్లో నన్ను అనుసరించే వాళ్లతో కలిసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయంగా నిలవాలనుకున్నా. తెలుగు రాతలతో పాటు కర్ణాటకలో ఉన్న మిత్రులు, అనుచరులను వాలంటీర్లుగా మార్చి ఓ బృందాన్ని ఏర్పాటు చేశా. ప్లాస్మా, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, అవసరమైన మందులు దొరకక ఇబ్బందులు పడుతున్న వాళ్లకు అండగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం' అని హనుమ విహారి తెలిపాడు.

ఇప్పుడు చేస్తుంది సరిపోదు:

ఇప్పుడు చేస్తుంది సరిపోదు:

'సామాజిక మాధ్యమ వేదికల ద్వారా సాయం కోరుతున్న వాళ్లకు వీలైనంత త్వరగా మా బృందం సహకరిస్తోంది. మా ప్రయత్నాన్ని చూసి స్ఫూర్తి పొందిన చాలా మంది నాకు తోడుగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఆక్సిజన్‌ కావాలంటూ, పడక దొరకలేదంటూ లేదా ఇంకేదో ఇబ్బంది గురించి నాకు వచ్చిన వినతులను వాళ్లకు పంపిస్తా. నా భార్య, సోదరి, ఆంధ్ర జట్టులోని కొంతమంది ఆటగాళ్లు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ కరోనాపై నేను ఇప్పుడు చేస్తుంది సరిపోదు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా' అని భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి ధీమా వ్యక్తం చేశాడు.

జట్టు కోరితే మళ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తా:

జట్టు కోరితే మళ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తా:

'2018-19 ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనర్‌గా ఆడా. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలోనూ జట్టు కోరితే మళ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు నేను సిద్ధం. జట్టు ఏం అడిగినా చేస్తా. నా కెరీర్‌లో నేనెక్కువగా టాప్‌ఆర్డర్‌లోనే ఆడాను కాబట్టి ఆ సవాలు కొత్త కాదు. గాయం కారణంగా నేను జట్టుకు దూరమైన సమయంలో వచ్చిన అవకాశాలను వాషింగ్టన్‌ సుందర్‌ చక్కగా ఉపయోగించుకున్నాడు. అతను గొప్పగా రాణించడం సంతోషంగా ఉంది. కానీ నా ఆటపైనే నేను పూర్తి దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. నా చేతుల్లో ఉన్నవాటినే నియంత్రించేందుకు ప్రయత్నిస్తా. నా బౌలింగ్‌పైనా శ్రద్ధ పెట్టా. ఆఫ్‌ బ్రేక్‌ బంతులు సమర్థంగా వేసేందుకు శ్రమిస్తున్నా. వార్విక్‌షైర్‌ తరపున కౌంటీల్లో మూడు మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇంగ్లండ్‌కు వచ్చా. ఈ అనుభవం వచ్చే సిరీసుల్లో ఉపయోగపడుతుంది' అని విహారి పేర్కొన్నాడు.

Story first published: Saturday, May 15, 2021, 10:29 [IST]
Other articles published on May 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X