న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రెడిట్ అంతా వారిద్దరికే చెందుతుంది: పదో టెస్టు సెంచరీపై హఫీజ్‌

Hafeez credits wife, Akhtar for Test century

హైదరాబాద్: దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తాను సాధించిన సెంచరీని తన భార్య నజియా, పాక్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్‌కు క్రెడిట్ ఇస్తున్నట్లు ఆ జట్టు ఓపెనర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ పేర్కొన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది.

<strong>సమీక్షించుకోకుంటే రెండో టెస్టులోనూ అదే ఫలితం!!</strong>సమీక్షించుకోకుంటే రెండో టెస్టులోనూ అదే ఫలితం!!

ఈ మ్యాచ్‌లో మహమ్మద్‌ హఫీజ్‌ 208 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 126 పరుగులతో సెంచరీతో చెలరేగాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మహమ్మద్‌ హఫీజ్‌ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు.

1
44238
ఇమాముల్‌ హక్‌ హాఫ్ సెంచరీ

ఇమాముల్‌ హక్‌ హాఫ్ సెంచరీ

మరో ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (188 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్‌) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లకు 255 పరుగులు చేసింది. హారిస్‌ సోహైల్‌ (15 బ్యాటింగ్‌), మహమ్మద్‌ అబ్బాస్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. రెండు సెషన్ల పైగా క్రీజులో నిలిచిన హఫీజ్, ఇమాముల్‌ తొలి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఓపెనర్లు చక్కటి శుభారంభం

ఓపెనర్లు చక్కటి శుభారంభం

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఓపెనర్లు హఫీజ్‌, ఇమాముల్‌ చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో హఫీజ్‌ 172 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో హఫీజ్‌కి ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఓపెనర్లు తొలి వికెట్‌కు 205 పరుగులు జోడించడం విశేషం. టీ విరామం అనంతరం ఇమాముల్‌ను ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ పెవిలియన్‌కు చేర్చాడు.

పాక్ తరుపున అనేక రికార్డులు

పాక్ తరుపున అనేక రికార్డులు

ఆ తర్వాత కొద్దిసేపటికే సిడిల్‌ బౌలింగ్‌లో హఫీజ్‌ వెనుదిరిగాడు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ పాక్ తరుపున అనేక రికార్డులను నమోదు చేశారు. పాక్‌ తరపున టెస్టుల్లో ఓపెనర్లు నమోదు చేసిన ఐదో ద్విశతక భాగస్వామ్యమిది. 2016 తర్వాత ఇదే మొదటిది. ఆస్ట్రేలియాపై ప్రత్యర్థి ఓపెనర్లు ద్విశతక భాగస్వామ్యం నెలకొల్పడం ఇది పదోసారి.

2000 తర్వాత ఇదే తొలిసారి

2000 తర్వాత ఇదే తొలిసారి

టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి 60 ఓవర్లలోపు ఆస్ట్రేలియా ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం 2000 తర్వాత ఇదే తొలిసారి. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో పాటు రెండు ఓవర్లలో ఆట పూర్తవుతుందనగా ప్రధాన బ్యాట్స్‌మన్‌ అజహర్‌ అలీ (18) అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో సిడిల్, నాథన్‌ లయన్, హోలాండ్‌ తలో వికెట్ తీశారు.

Story first published: Monday, October 8, 2018, 12:15 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X