న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కళ్లు చెమర్చాయి: కోహ్లీసేనకు ట్రోఫీ బహుకరణపై సునీల్ గవాస్కర్

India vs Australia : Kohli Lifting Trophy Brought Tears To Sunil Gavaskar’s Eyes | Oneindia Telugu
Had tears in my eyes when Virat Kohli lifted Border-Gavaskar Trophy: Sunil Gavaskar

హైదరాబాద్: సిడ్నీ మైదానంలో భారత క్రికెట్ జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందుకున్న తరుణంలో తన కళ్లు చెమర్చాయిని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

<strong>వీడియోతో స్పెషల్ మెసేజ్: కోహ్లీ, పుజారాలపై రిచర్డ్స్‌ ప్రశంసల వర్షం</strong>వీడియోతో స్పెషల్ మెసేజ్: కోహ్లీ, పుజారాలపై రిచర్డ్స్‌ ప్రశంసల వర్షం

ఈ విజయం ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు.

2-1తో టెస్టు సిరిస్‌ కైవసం

2-1తో టెస్టు సిరిస్‌ కైవసం

తాజా పర్యటనలో ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి 2-1తో టెస్టు సిరిస్‌ను సొంతం చేసుకుంది. భారత క్రికెట్‌ జట్టుకు ట్రోఫీని అందజేసే అవకాశం లభించివుంటే ఎంతో గర్వపడేవాడినని సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. "నాకెంతో గర్వంగా ఉంది. ఆసీస్ గడ్డపై కోహ్లీసేన చరిత్రాత్మక విజయం సాధించిన ఆ సందర్భంలో నా కళ్లు చెమర్చాయి" అని చెప్పుకొచ్చాడు.

ఎంతో ఆనందపడేవాడిని

ఎంతో ఆనందపడేవాడిని

"భారత్‌కు ట్రోఫీని అందించే అరుదైన అవకాశం లభించివుంటే ఎంతో ఆనందపడేవాడిని. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. కనీసం సిడ్నీ వెళ్లివుంటే నా స్నేహితుడు అలెన్‌ బోర్డర్‌ను కలిసివుండేవాడి" అని సునీల్ గవాస్కర్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బహూకరణ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్వాకం వల్ల గవాస్కర్‌కు ఆహ్వానం పంపలేదు.

బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందించలేకపోయాడు

బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందించలేకపోయాడు

దీంతో గవాస్కర్ అక్కడికి వెళ్లడం లేదు. బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందించలేకపోయాడు. నిజానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ గత మే నెలలో గవాస్కర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గవాస్కర్‌కు ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ఆహ్వానం మాత్రం అందలేదు.

స్వయంగా వెల్లడించిన గవాస్కర్

స్వయంగా వెల్లడించిన గవాస్కర్

కనీసం సిరీస్‌కు ముందైనా చెబితే సోనీ సంస్థ ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకునేదని ఇప్పుడు మాత్రం ఏ అవకాశం లేదని గవాస్కర్ వెల్లడించారు. "ఈ ట్రోఫీ ప్రదానోత్సవానికి రావడం కుదురుతుందా అని మే నెలలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ అడిగాడు. సంతోషంగా వస్తా అని చెప్పా. కానీ తర్వాత సదర్లాండ్‌ పదవి నుంచి దిగిపోయాడు. ఆపై నన్నెవరూ సంప్రదించలేదు'' అని గావస్కర్‌ అన్నాడు.

సీఏ వాదన మరోలా

సీఏ వాదన మరోలా

మరోవైపు సీఏ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ టిమ్‌ విటకెర్‌ మాట్లాడుతూ జూన్‌లో ఒకసారి, ఆగస్టులో మరోసారి గవాస్కర్‌కు ఆహ్వానాలు పంపామని అన్నారు. అయితే ఈ ఆహ్వానాల స్క్రీన్‌ షాట్స్‌ చూపగలరా? అంటే మాత్రం ‘మీడియాకు మా అధికారిక ఆహ్వానాలు వెల్లడించం' అని ఆయన బదులిచ్చారు. దీంతో ఈ బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని బోర్డర్‌ ఒక్కడే బహూకరించాడు.

Story first published: Wednesday, January 9, 2019, 15:02 [IST]
Other articles published on Jan 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X