న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Support Trump, f**k Iran: డారెన్ లీమన్ ట్విట్టర్ నుంచి హ్యాకర్ ట్వీట్!

Hacker takes over Darren Lehmanns Twitter account, posts messages abusing Iran

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమన్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఇరాన్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన సందేశాలను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు డారెన్ లీమన్ కోచ్‌గా వ్యవహారిస్తున్నారు.

డారెన్ లీమన్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని బ్రిస్బేన్ హీట్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "హాయ్ హీట్ అభిమానులకు ధన్యవాదాలు. మా కోచ్ డారెన్ లెమాన్ యొక్క ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ట్విట్టర్‌తో కలిసి పనిచేస్తున్నాం. అసభ్యకర సందేశాలు పోస్టు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాం" అని ట్వీట్ చేసింది.

<strong>1 win in 26 years: టెస్టుల్లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ చెత్త రికార్డు!</strong>1 win in 26 years: టెస్టుల్లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ చెత్త రికార్డు!

డారెన్ లీమన్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్ ఖాతా పేరుని 'ఖాస్సేమ్ సోలైమాని | F ** k ఇరాన్'గా పేరు మార్చాడు. అంతేకాదు వరుస ట్వీట్లతో ఇరాన్‌ను తిడుతూ అసభ్యకర మెసేజ్‌లు పోస్టు చేశాడు. ట్విట్టర్‌లో డారెన్ లీమన్‌ను సుమారు 340,000పైగా ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు.

Hacker takes over Darren Lehmanns Twitter account, posts messages abusing Iran

దీంతో హ్యాకర్ ఇరాన్‌కు సంబంధించి అసభ్యకర మెసేజ్‌లు పోస్టు చేయడంతో ఫాలోవర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం లీమన్ బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు కోచింగ్‌లో బిజీగా ఉన్నాడు. 2018లో, కేప్ టౌన్‌లో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం తరువాత లీమాన్ ఆస్ట్రేలియా కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.

నాలుగు రోజుల టెస్టు.. ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించిన పాంటింగ్!!నాలుగు రోజుల టెస్టు.. ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించిన పాంటింగ్!!

షేన్ వాట్సన్ తర్వాత ఇటీవలి కాలంలో ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిన రెండవ ఆస్ట్రేలియన్ క్రీడాకారుడిగా డారెన్ లీమన్ నిలిచాడు. గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్టు చేశాడు. ఇందుకు వాట్సన్ క్షమాపణలు కూడా తెలిపాడు.

Story first published: Monday, January 6, 2020, 18:24 [IST]
Other articles published on Jan 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X