న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దిలీప్ సర్దేశాయ్ 78వ పుట్టినరోజు జరుపుతోన్న గూగుల్

Google Celebrates Cricketer Dilip Sardesais Birthday With A Doodle

హైదరాబాద్: రోజుకో ప్రత్యేకతను వినియోగదారుల మందుంచే గూగుల్ ఆగష్టు 8వ తేదీని డూడుల్ రూపంలో భారత వినియోగదారులతో పంచుకుంది. దిలీప్ సర్దేశాయ్ టీమిండియా సీనియర్ క్రికెటర్ 78వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌ను రూపొందించి శుభాకాంక్షలు తెలుపుతోంది. పందొమ్మిదో శతాబ్దంలో భారత క్రికెట్‌ను దశదిశలా చాటేందుకు పునాదులు వేసిన వారిలో దిలీప్ సర్దేశాయ్ ఒకరు. 1959-60లలో జరిగిన రోహింటన్ బారియా ట్రోఫీలో మొదటి సారి గుర్తింపును పొందారు.

ఏకంగా 435 పరుగులతో 87సగటుతో బౌలర్లకు దడ పుట్టించిన ఆయన క్రమంగా ఎదుగుతూ వచ్చారు. దిలీప్ సర్దేశాయ్ అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను పాకిస్థాన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. పూణెలో జరిగిన ఆ మ్యాచ్ 1960-61లో జరిగిన మ్యాచ్ 194నిమిషాల్లోనే 87పరుగులు చేశారు. ఆ విజయం తర్వాత సర్దేశాయ్‌తో కలిసి అదేజట్టుతో బెంగళూరులో మరో మ్యాచ్‌లో తలపడింది. ఆ మ్యాచ్‌లోనూ అసమాన ప్రతిభ చాటి.. 106 పరుగులు పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లలో మద్రాసు యూనివర్సిటీపై 202పరుగులు చేశారు.

ఆ తర్వా త ముంబై జట్టు తరపున రంజీ ట్రోఫీకి సెలక్ట్ అయ్యారు. ఇలా 1960-61వ సంవత్సరంలో జరిగిన టాప్ 5 ఇండియన్ క్రికెటర్లలో ఒకరిగా దిలీప్ సర్దేశాయ్ పేరు తెచ్చుకున్నారు. ఇంత బాగా రాణించిన దిలీప్ సర్దేశాయ్ 2007 జూలై 2న తుది శ్వాస విడిచారు. ముంబై హాస్పిటల్‌లో 23 జూన్‌న చేరిన ఆయన చికిత్స తీసుకుంటూ కొద్ది రోజులు మాత్రమే ప్రాణాలు నిలుపుకోగలిగారు.

దిలీప్ భార్య నందినీ ఇండియన్ మోషన్ పిక్చర్స్‌కు సభ్యురాలిగా పనిచేశారు. అతని సంతానంలో ఒకరైన రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రముఖ వార్తా మాధ్యమం ఐబీఎన్, సీఎన్ఎన్ ఐబీఎన్, ఐబీఎన్7, ఐబీఎన్ లోక్‌మత్‌లకు ముఖ్య సంపాదకుడిగా పనిచేశారు. అతని కుమార్తె సోనాలీ సీనియర్ శాస్త్రవేత్తగా వాషింగ్టన్‌లో విధులు నిర్వహించారు. అతని అల్లుడు తైమూర్ బైగ్ సింగపూర్‌లోని విద్యాసంస్థకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. అతని కోడలు సాగరిక గోస్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.

Story first published: Wednesday, August 8, 2018, 17:08 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X