ఆసీస్ జట్టులోకి మ్యాక్స్‌వెల్‌ మళ్లీ వచ్చేసాడు!!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మానసిక సమస్యల కారణంగా గతేడాది క్రికెట్‌ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న విషయం తెలిసిందే. విరామం అనంతరం బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నాడు. ఈ లీగ్ కారణంగానే జనవరిలో టీమిండియా సిరీస్‌కు దూరమయ్యాడు. బిగ్ బాష్ లీగ్ ఈ నెల 8తో ముగియనుంది. దీంతో మ్యాక్స్‌వెల్‌ మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు.

సిద్దార్ధ్‌ కౌల్‌ హ్యాట్రిక్‌.. తొలిరోజే 24 వికెట్లు!!

త్వరలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల, మూడు టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. ఈ రెండు సిరీస్‌ల కోసం 14 మందితో కూడిన జట్లను క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు మరో ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌, టెస్టుల్లో ఆడుతున్న మాథ్యూ వేడ్‌లు ఈ రెండు ఫార్మాట్‌లకు ఎంపికయ్యారు. రెండు జట్లకు ఆరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తాడు.

ఫిబ్రవరి 21న జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా పర్యటన మొదలవుతుంది. అనంతరం ఫిబ్రవరి 23, 26వ తేదీల్లో మిగిలిన రెండు టీ20లు జరుగనున్నాయి. ఇక ఫిబ్రవరి 29.. మార్చి 4, 7వ తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. 31 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌ బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు నాయకత్వం వహించాడు. బిగ్ బాష్ లీగ్‌లో మ్యాక్సీ బ్యాట్, బాల్ రెండింటితో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. 389 పరుగులు చేయడంతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా టీ20 జట్టు: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిషెల్‌ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ, పాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, సీన్‌ అబాట్, కేన్‌ రిచర్డ్సన్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆడమ్‌ జంపా.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్నస్ లబూషేన్‌, మిషెల్‌ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ, పాట్ కమిన్స్, ఆస్టన్ అగర్, జొస్ హాజల్‌వుడ్, కేన్‌ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆడమ్‌ జంపా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, February 5, 2020, 10:08 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X