న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్స్‌వెల్.. అతి చేసి.. అబ్బబ్బే కాదని సర్ది చెప్పుకుంటూ..

Glenn Maxwell accused of bitter handshake snub after Aussies lose to Pakistan

హైదరాబాద్: సిరీస్ గెలుచుకున్న పాకిస్థాన్ విజయోత్సాహంతో మ్యాచ్ వదలి వెళ్తుంటే.. పరాజయానికి గురై మైదానాన్ని వీడింది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ మ్యాక్స్‌వెల్ క్రీడా స్ఫూర్తిని మరిచి ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం ఆసీస్‌తో జరిగిన టీ 20 ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ విజయం సాధించి విజేతగా నిలిచింది. పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ముక్కోణపు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆసీస్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ క్రీడా స్ఫూర్తిని మరిచాడు.

పాకిస్తాన్‌ క్రికెటర్లతో కరచాలనం చేసే క్రమంలో మ్యాక్స్‌వెల్‌ అతిగా ప్రవర్తించాడు. అంపైర్లకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన మ‍్యాక్స్‌ వెల్‌.. అదే సమయంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో కరాచలనం చేయడానికి ఆసక్తికనబరచలేదు. సర్ఫరాజ్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చినా మ్యాక్సీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య పదే పదే మాటల యుద్ధం జరగడమే మ్యాక్సీ అలా ప్రవర్తించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరొకవైపు ఆసీస్‌ ఓడి పోవడాన్ని కూడా మ్యాక్స్‌వెల్‌ జీర్ణించుకోలేకపోయినట్లున్నాడు. అయితే ప్రత్యర్థి ఆటగాళ్లతో మ్యాక్సీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.

దీనిపై మ్యాక్సీ తాజాగా వివరణ ఇస్తూ.. అది కావాలని చేసింది కాదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు. కేవలం పొరపాటులో భాగంగానే అలా జరిగిందన్నాడు. ఆ తర్వాత సర్పరాజ్‌ను హోటల్‌ కలిసి అభినందించేందుకు వేచి చూస్తున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 10, 2018, 15:25 [IST]
Other articles published on Jul 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X