న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీని రెచ్చగొడితే.. మీరే నష్టపోతారు'

Give Kohli silent treatment to curb his runs: Du Plessis advice to Australia

హైదరాబాద్: కెప్టెన్ గానే కాదు.. అంతర్జాతీయ క్రికెటర్‌గా టాప్‌లో స్థానం దక్కించుకున్న కోహ్లీ అంటే అభిమానంతో పాటు భయం కూడా ఉంది. ఈ విషయం దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాటల్లో అర్థమవుతోంది. మరి కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటన చేయనున్న టీమిండియాలో కోహ్లీ ఆడనున్నాడు. వెస్టిండీస్ వన్డే సిరీస్ తర్వాత.. టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైన కోహ్లీని ఎవ్వరూ రెచ్చగొట్టద్దని డుప్లెసిస్ హితవు పలికాడు.

కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని డుప్లెసిస్‌

కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని డుప్లెసిస్‌

ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని డుప్లెసిస్‌ సూచించాడు. నవంబరు 21 నుంచి టీమిండియా ఆసీస్ గడ్డపై 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా చేస్తున్న విదేశీ పర్యటన ఇదే. ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందు భారత్ సఫారీ గడ్డపై తలపడింది. ఆ అనుభవంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. కోహ్లీ‌ని మాత్రం సిరీస్‌లో రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దని ఆసీస్‌కి సూచించాడు.

ఓపెనర్‌గా అవకాశాల్లేవనే రిటైర్‌మెంట్ ప్రకటించా: లక్ష్మణ్

కోహ్లీ ఆడిన 3 టెస్టుల్లో 286 పరుగులతో

కోహ్లీ ఆడిన 3 టెస్టుల్లో 286 పరుగులతో

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకి భారత్ జట్టు వెళ్లగా.. కోహ్లీ తాను ఆడిన మూడు టెస్టుల్లో ఏకంగా 286 పరుగులతో సత్తాచాటాడు. అయితే.. అవి చాలా తక్కువని.. తమ క్రికెటర్లు సిరీస్‌లో సైలెంట్‌గా ఉండటంతోనే.. కోహ్లీని ఆ మాత్రమైనా కట్టడిచేయగలిగామని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

రెచ్చగొట్టకూడదని జట్టు సమావేశంలో

రెచ్చగొట్టకూడదని జట్టు సమావేశంలో

ప్రత్యర్థి కవ్వింపులనే సవాల్‌గా తీసుకుని ఆడే క్రికెటర్లు ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువగా కనిపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ జాబితాలో అగ్రగణ్యుడు. ప్రత్యర్థితో ఛాలెంజ్ విసిరి ఢీకొట్టడాన్ని బాగా ఆస్వాదిస్తాడు. అందుకే.. సిరీస్ ఆరంభానికి ముందే అతడ్ని రెచ్చగొట్టకూడదని జట్టు సమావేశంలో నిర్ణయించుకున్నాం.

 సైలెంట్ ట్రీట్‌మెంట్‌తోనే కోహ్లీని ట్రీట్ చేసి

సైలెంట్ ట్రీట్‌మెంట్‌తోనే కోహ్లీని ట్రీట్ చేసి

'పర్యటన ముగిసేంతవరకూ‘సైలెంట్ ట్రీట్‌మెంట్'తోనే అతను ట్రీట్ చేశాం. అయినప్పటికీ.. కోహ్లీ పరుగులు సాధించాడు. కానీ.. అతని జోరుతో పోలిస్తే.. అవేమీ ఎక్కువ కాదని మా అభిప్రాయం. సెంచూరియన్ మైదానంలో కోహ్లీ సెంచరీ బాదడం మమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచింది. సఫారీ జట్టుకు అనుకూలించినట్లు ఆసీస్‌కు ఇదే పద్ధతి అనుకూలిస్తుందో లేదో చూద్దాం' అని డుప్లెసిస్ ముగించాడు.

Story first published: Friday, November 16, 2018, 13:50 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X