ఓపెనర్‌గా అవకాశాల్లేవనే రిటైర్‌మెంట్ ప్రకటించా: లక్ష్మణ్

హైదరాబాద్: నెల రోజులకు పైగా ఊరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ఎట్టకేలకు తన ఆత్మకథ(281 అండ్ బియాండ్)ను విడుదల చేశాడు. ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియని విషయాలను పుస్తకం ద్వారా బయటపెట్టాడు. మనకు బ్యాట్స్‌మన్‌గా మాత్రమే తెలిసిన లక్ష్మణ్ కెరీర్‌లో బౌలర్‌లోని కోణాన్ని పరిచయం చేశాడు. అసలు తన క్రికెట్ కెరీర్ ఆరంభమే పేసర్‌గానని అందులో పొందుపరిచాడు. అండర్-19 స్థాయి వరకు అతను బౌలర్‌గానే కొనసాగాడట.
'281 అండ్ బియాండ్'అనే ఆత్మకథను గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అర్షద్ అయూబ్, వెంకటపతి రాజుతో పాటు క్రికెట్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్..

1994-95 వరకు పేసర్‌గానే
కెరీర్‌ను మీడియం పేసర్‌గానే ఆరంభించాను. 1994-95 వరకు నా ప్రయాణం పేసర్‌గా కొనసాగింది. ఈ సమయంలో కేరళతో జరిగిన అండర్-16 మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున ఏడు వికెట్లు తీయగలిగాను. కానీ, నా బౌలింగ్‌లో వేగంపై సందేహం కలిగింది. 115, 120 కిమీ వేగంతో బంతులు వేస్తూ టీమిండియాకు ఆడలేనని అర్థమైంది. బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించా.

కెరీర్‌లో ఆ మూడే కీలక ఘట్టాలు:
నా కెరీర్‌లో కీలక ఘట్టాలు ఏంటంటే.. డాక్టర్‌గా కెరీర్‌ను ఎంచుకోకపోవడం, టీమిండియా ఓపెనర్ స్థానాన్ని తిరస్కరించడం, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం కఠిన నిర్ణయాలుగా మిగిలాయి. ఈ మొత్తంలో ఓపెనర్ స్థానాన్ని వద్దనుకోవడమే కఠిన నిర్ణయంగా అనిపిస్తుంది. ఓపెనర్‌గా ఆడితే కంటే మూడో స్థానంలో ఆడినప్పుడే నా బాగా రాణిస్తానని సన్నిహితులు చెప్తే.. దాని కోసం ప్రయత్నించా. కానీ, ఓపెనర్‌గా అవకాశాలు రాకపోవడంతో టీమిండియాపై ఆశలు వదులుకున్నా.

ఆ స్థానాల్లో వాళ్లుండటంతో
అప్పటి టీమిండియాలో 3 స్థానంలో ద్రవిడ్, 4లో సచిన్, 5లో అజహర్, 6లో గంగూలీ జట్టులో ఉన్నారు. అక్కడ చోటు దొరకదని నిర్ణారణకు వచ్చేశా. అందుకే టీమిండియాపై ఆశలు వదులుకున్నా. ఆ తర్వాత రంజీ క్రికెటర్‌గా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నా. ఎలాగైనా హైదరాబాద్‌ను రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా చూడాలనే లక్ష్యంతోనే ఆడాను.

సెహ్వాగ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చినప్పుడు
సెహ్వాగ్‌కు ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం వచ్చినప్పుడు సలహా ఇచ్చాను. నాలా కెరీర్‌ను పాడు చేసుకోవద్దని సూచించా. మంచి ఉద్దేశ్యంతోనే అలా మాట్లాడాను. అతను నిర్ణయం సొంతగా తీసుకున్నాడు. నా కెరీర్‌లో 281 ఇన్నింగ్స్ కంటే సిడ్నీలో ఆస్ట్రేలియాపై సాధించిన 167 పరుగుల ఇన్నింగ్సే ప్రత్యేకం. ఎందుకంటే టెస్టుల్లో అది నాకు తొలి సెంచరీ. 4 సంవత్సరాల తర్వాత సాధించిన ఆ సెంచరీ కావడంతో మళ్లీ నాలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications