న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గర్ల్‌ఫ్రెండ్‌ను కాకుండా ఆర్చర్ ఇంకెవరిని కలిశాడో తెలుసా?!!

Girlfriend or dog: Whom did Jofra Archer meet after Southampton Test

మాంచెస్టర్‌: మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం స్టార్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టు పూర్తయ్యాక ఆర్చర్ బయో సెక్యూర్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించినందుకు.. రెండో టెస్టుకు కొద్ది గంటల ముందు అతన్నిఇంగ్లండ్ బోర్డు సస్పెండ్ చేసింది. తొలి మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లను తమ సొంత కార్లలో నేరుగా మాంచెస్టర్‌కు వెళ్లమని చెప్పగా.. ఆర్చర్‌ ఆ నిబంధనల్ని పాటించకుండా ఇంటికి వెళ్లినట్లు ఈసీబీ గుర్తించింది.

ఐసోలేషన్‌లో ఆర్చర్

ఐసోలేషన్‌లో ఆర్చర్

జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయితేనే అతడు తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశం నెలకొంది. అయితే ఆర్చర్‌ ఈ బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించడంతో తనతో పాటు ఇంగ్లండ్ జట్టు సభ్యులందరినీ ప్రమాదంలో పడేశాడు. కేవలం జట్టునే కాకుండా మైదాన సిబ్బంది, ఇతరులను కూడా. ఇందుకు కారణం ఆర్చర్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడమే.

గర్ల్‌ఫ్రెండ్ కోసం

గర్ల్‌ఫ్రెండ్ కోసం

ది గార్డియన్ మరియు ది డైలీ మెయిల్‌ నివేదికల ప్రకారం... జోఫ్రా ఆర్చర్ నేరుగా సౌతాంప్టన్ (మొదటి టెస్ట్ వేదిక) నుండి మాంచెస్టర్ (రెండవ టెస్ట్ వేదిక)కి వెళ్ళలేదు. ప్రోటోకాల్స్ ప్రకారం ఇంగ్లీష్ ఆటగాళ్ళు మరియు సిబ్బంది మాంచెస్టర్ చేరుకోగా.. ఆర్చర్ మాత్రం మార్గ మద్యలో సస్సెక్స్‌లోని తన ఇంటికి వెళ్లాడు. అక్కడ అతను తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలిశాడట. సుమారు ఓ గంట పాటు ఇంట్లో ఉండి ఆపై తన కారులో మాంచెస్టర్ చేరుకున్నాడట. అనంతరం మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే ఆర్చర్ గర్ల్‌ఫ్రెండ్‌కు నెగటివ్ ఉన్నప్పటికీ రూల్స్ బ్రేక్ చేశాడు కాబట్టి ఈసీబీ చర్యలు తీసుకుంది.

కుక్కను చూడడనికి

కుక్కను చూడడనికి

అయితే ది సన్ పత్రికలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం... జోఫ్రా ఆర్చర్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి ఇంటికి వెళ్లలేదట. ఇంట్లో ఉన్న తన పెంపుడు కుక్కను చూడడనికి వెళ్లాడని పేర్కొంది. ఆర్చర్ స్నేహితులతో కూడా కుక్కను కలవడానికి అతడు ఇంటికి వచ్చాడని మీడియా సంస్థతో అన్నారు. దీంతో బోర్డు, అభిమానులు అందరూ ఎవరిని కలవడానికి వెళ్లాడని ఆలోచనల్లో పడ్డారు. ఏదేమైనా ఆర్చర్ బయో సెక్యూర్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లని కూడా కరోనా ప్రమాదంలో పడేసిన ఆర్చర్‌పై అందరూ మండిపడుతున్నారు.

రూము వెలుపలికి వచ్చేందుకు కూడా అనుమతి లేదు

రూము వెలుపలికి వచ్చేందుకు కూడా అనుమతి లేదు

వాస్తవానికి ఈ బయో-సెక్యూర్ బబుల్‌లోకి ఒక్కసారి క్రికెటర్ లేదా మ్యాచ్ అధికారులు వచ్చిన తర్వాత సిరీస్ ముగిసే వరకూ వాళ్లు ఆ బబుల్ నుంచి వెలుపలికి వెళ్లకూడదనేది నిబంధన. కానీ.. జోప్రా ఆర్చర్ తన ఇంటికి వెళ్లడం ద్వారా ఆ బబుల్‌ నుంచి వెలుపలికి వెళ్లాడు. దాంతో గురువారం మాంచెస్టర్ వేదికగా ఆరంభమైన రెండో టెస్టు నుంచి అతడ్ని తప్పించిన ఈసీబీ.. ఐదు రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది. మాంచెస్టర్‌లోని హోటల్‌ రూముకి పరిమితమైన ఆర్చర్.. కనీసం రూము వెలుపలికి వచ్చేందుకు కూడా అనుమతి లేదు.

నాకెలాంటి సానుభూతి లేదు

నాకెలాంటి సానుభూతి లేదు

బుద్దిలేని పనితో ఆటగాళ్లందరినీ రిస్క్‌లో పడేసిన జోఫ్రా ఆర్చర్ పై తనకు ఏమాత్రం సానుభూతి లేదని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ అన్నాడు. 'బయో సెక్యూర్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించిన జోఫ్రా ఆర్చర్‌పై నాకెలాంటి సానుభూతి లేదు. అయినా అతను ఎందుకు అలా బుద్దిలేకుండా వ్యవహరించాడో నాకు అర్థంకావడం లేదు. త్యాగం అంటే నెల్సన్ మండేలాది. అతను 27 ఏళ్లు ఓ చిన్నసెల్‌లో ఎలాంటి తప్పిదం చేయకుండా ఉన్నాడు. కానీ ఆర్చర్ కొద్ది రోజులు బయోబబుల్‌లో ఉండలేకపోయాడు' అని హోల్డింగ్ అన్నాడు.

'ఎప్పుడూ ధోనీ సర్‌‌ను ఫాలో అవుతా.. ఆయన వీడియోలు చూసి చాలా నేర్చుకున్నా'

Story first published: Friday, July 17, 2020, 15:37 [IST]
Other articles published on Jul 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X