న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కవ్వింపుల్లేక కోహ్లీ విఫలమవుతున్నాడు: గంభీర్

Gautam Gambhir Says Virat Kohli Is At His Best When He Is Riled Up
Virat Kohli Is At His Best When He Is Riled Up Says Gautam Gambhir | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్‌ ఆడిన విరాట్ కోహ్లీ.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ సుదీర్ఘ కెరీర్‌లో ఈ విధంగా ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ విఫలమవలేదు. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్ల కవ్వింపులు లేకపోవడం వల్లనే కోహ్లీ విఫలమయ్యాడని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు కోహ్లీ అత్యుత్తమంగా ఆడుతాడని ఈ క్రికెటర్ కమ్ పొలిటీషన్ ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.

ఉదారతే కొంపముంచింది..

ఉదారతే కొంపముంచింది..

ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా సౌమ్యులని ఈ పర్యటనకు ముందు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ని ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా..? అని మీడియా ప్రశ్నించగా.. అలాంటి భావనే తమకు లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. అంతేకాకుండా.. కివీస్‌ ఆటగాళ్లని చూస్తే కవ్వింపులు, ప్రతీకార ఆలోచనలే రావన్నాడు. కివీస్ ఆటగాళ్లు కూడా కోహ్లీని రెచ్చగొట్టే పనులు ఒక్కటీ చేయలేదు. ఇదే అతని వైఫల్యానికి కారణమని గంభీర్ చెప్పుకొచ్చాడు.

IND vs NZ రెండో టెస్ట్ ప్రివ్యూ : సమం చేస్తారా? లేక సమర్పించుకుంటారా?

కవ్విస్తే కోహ్లీ ఆగడు..

కవ్విస్తే కోహ్లీ ఆగడు..

‘ఇది అతని విషయంలో పనిచేస్తుందా? అనేది కచ్చితంగా చెప్పలేను. కానీ ప్రత్యర్థి నుంచి కవ్వింపులు ఎదురైనప్పుడు కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

ముఖ్యంగా.. బౌలర్ల నుంచి కవ్వింపులు, రెచ్చగొట్టేరీతిలో బౌన్సర్లు సంధించినప్పుడు కోహ్లీ ఏకాగ్రత పతాక స్థాయికి చేరుతుంది. రివేంజ్ అనేది పెద్ద మాట కావచ్చు. కానీ కోహ్లీ ఆడాలంటే అతను ఢీ అంటే ఢీ అన్నట్లు మైదానంలో వ్యవహరించాలి.'అని గంగూలీ సూచించాడు.

ఆస్ట్రేలియా టూర్‌లో..

ఆస్ట్రేలియా టూర్‌లో..

2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ తనని పదే పదే కవ్వించడంతో ఆ సిరీస్‌లో కోహ్లీ ఏకంగా నాలుగు సెంచరీలు బాదేసిన విషయం తెలిసిందే. గత ఏడాది వెస్టిండీస్ బౌలర్ విలియమ్స్‌‌‌ చేసిన కవ్వింపులకి హిట్టింగ్‌తో బదులిస్తూ నోట్‌బుక్, సైలెంట్, సర్‌ప్రైజ్ సెలబ్రేషన్స్‌తో కోహ్లీ రెచ్చిపోయాడు.

కోహ్లీలో కనిపించని ఉత్సాహం..

కోహ్లీలో కనిపించని ఉత్సాహం..

సాధారణంగా ప్రత్యర్థి జట్టు వికెట్ పడగానే బౌలర్ కంటే కోహ్లీనే ఎక్కువగా మైదానంలో సందడి చేస్తుంటాడు. కానీ.. కివీస్ పర్యటనలో కోహ్లీలో ఆ ఉత్సాహం కనిపించ లేదు. ఒకవైపు బ్యాట్స్‌మెన్‌గా పేలవ ఫామ్.. మరోవైపు కెప్టెన్‌‌గా ఉత్సాహలేమితో కోహ్లీ ఉంటుండటంతో.. సహచరుల్లోనూ ఆ ఊపు కనిపించడం లేదు. మ్యాచ్ ఏ స్థితిలో ఉన్నా.. ఎప్పుడూ గెలుపు కాంక్షతో రగిలిపోతూ.. సహచరుల్లో ధైర్యాన్ని నింపే కోహ్లీ ఇలా ఉండటం టీమిండియా ఆటపైనా ప్రభావం చూపుతోంది.

Story first published: Friday, February 28, 2020, 15:56 [IST]
Other articles published on Feb 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X