న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ vs కోహ్లీ.. వన్డేల్లో ఎవరు గొప్పో చెప్పిన గంభీర్

Gautam Gambhir Says ODI Rule Changes to Pick Sachin Tendulkar as Better Batsman than Virat Kohli
Sachin Tendulkar Is The Better Batsman Than Virat Kohli In ODIs - Gautam Gambhir

న్యూఢిల్లీ: వన్డే ఫార్మాట్‌లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బెటర్ బ్యాట్స్‌మన్ అని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తెలిపాడు. దీనికి ఆటలో వచ్చిన మార్పులే కారణమన్నాడు. ఆటలో మారిన నిబంధనలతో ప్రస్తుత బ్యాట్స్‌మన్‌కు పరుగులు చేయడం సులువైందని ఈ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ చెప్పుకొచ్చాడు.

సచిన్ 49.. కోహ్లీ 43..

సచిన్ 49.. కోహ్లీ 43..

ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్.. తన కెరీర్‌లో మొత్తం 463 వన్డేలు ఆడి 49 సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ 243 వన్డేల్లో 43 సెంచరీలతో 11,867 పరుగులు చేశాడు. సచిన్ సగటు 44.83 కాగా.. కోహ్లీ యావరేజ్ 59.33. ఇక మాస్టర్ కన్నా విరాట్ కేవలం 6 సెంచరీలే వెనుకంజలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ వారసుడు విరాటేనని, అతని 100 సెంచరీల రికార్డును అధిగమిస్తాడని ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు.

సచినే బెటర్..

సచినే బెటర్..

ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ అంశంపై స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంభీర్ మాట్లాడాడు. ‘విరాట్ కన్నా సచినే బెటర్ బ్యాట్స్‌మన్. ఎందుకంటే సచిన్ ఒక్క తెల్లబంతి, సర్కిల్‌లో నలుగురు ఫీల్డర్స్ మాత్రమే ఉన్నప్పుడు ఆడాడు. అందుకే నా దృష్టిలో సచినే గొప్ప బ్యాట్స్‌మన్'అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత తరం వన్డేల్లో రెండు వైట్ బాల్స్ ఉపయోగించడంతో పాటు మూడు పవర్‌ప్లేస్ విధానంతో ఆడిస్తున్న విషయం తెలిసిందే.

మారిన రూల్స్‌తో బ్యాట్స్‌మన్‌కు ఈజీ..

మారిన రూల్స్‌తో బ్యాట్స్‌మన్‌కు ఈజీ..

తొలి పవర్ ప్లేలో(1-10 ఓవర్లు) 30 యార్డ్ సర్కిల్‌ దాటి ఇద్దరు ఫీల్డర్లను మాత్రమే అనుతిస్తారు. సెకండ్ పవర్ ప్లేలో (10-40 ఓవర్లు) సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు ఉంటారు. చివరి పవర్‌ప్లేలో (40-50) ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ దాటి ఫీల్డింగ్ చేస్తారు. ఇక గంభీర్ ఈ మారిన రూల్స్‌నే ప్రస్తావిస్తూ ఇవి బ్యాట్స్‌మన్‌కు మేలు చేసాయని చెప్పుకొచ్చాడు.

‘ఇద్దరిలో బెస్ట్ ఎవరో చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే విరాట్ అద్భుతమైన బ్యాట్స్‌మన్. కానీ మారిన రూల్స్ నూతన బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ తరం రెండు బంతులతో ఎలాంటి రివర్స్ స్వింగ్, ఫింగర్ స్పిన్ లేకుండా ఆడుతుంది. అంతేకాకుండా 50 ఓవర్ల పాటు ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్‌లోపలే ఉంటున్నారు. దీంతో బ్యాటింగ్ చాలా సులువైంది.'అని ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ బ్యాట్స్‌మన్ వివరించాడు.

కరోనా దెబ్బకు రోజు కూలీగా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్!

నాటి లక్ష్యాలు చూస్తే..

నాటి లక్ష్యాలు చూస్తే..

అంతేకాకుండా సచిన్ దీర్ఘకాలంగా ఆడటం, ఆడినంత కాలం పరుగుల ప్రవాహాన్ని పారించడం దృష్టిలో ఉంచుకోని కూడా అతనే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని చెబుతున్నానన్నాడు. అప్పటి నిబంధనల మధ్య సచిన్ ఆడిన తీరు.. అప్పుడు నమోదైన 230, 240 లక్ష్యాలను చూస్తే నాటి కఠిన పరిస్థితులు అర్థం అవుతాయన్నాడు.

బుమ్రాను కొనుగోలు చేయమని కోహ్లీకి ముందే చెప్పా.. కానీ నా మాట వినలేదు: పార్దివ్ పటేల్

Story first published: Thursday, May 21, 2020, 14:35 [IST]
Other articles published on May 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X