న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్మప్ మ్యాచ్‌లో డకౌట్: టెస్టు ఓపెనర్‌గా రోహిత్‌పై ఒత్తిడి, గంభీర్ ఇలా!

Gautam Gambhir puts his weight behind Rohit Sharma as Test opener

హైదరాబాద్: రోహిత్ శర్మ తనకు తానుగా టెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ప్రకటించుకోవడం అనేది ఓ అద్భుతమైన అవకాశమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. విండిస్ పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ విఫలం కావడంతో ఓపెనర్‌గా ఆడేందుకు రోహిత్ శర్మకు సువర్ణావకాశం వచ్చింది.

విశాఖ వేదికగా బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. టెస్టు సిరిస్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మ టెస్టుల్లో టీమిండియా తదుపరి వీరేంద్ర సెహ్వాగ్ అవుతాడా?రోహిత్ శర్మ టెస్టుల్లో టీమిండియా తదుపరి వీరేంద్ర సెహ్వాగ్ అవుతాడా?

రోహిత్‌ శర్మ టెస్టు ఓపెనింగ్‌పై

రోహిత్‌ శర్మ టెస్టు ఓపెనింగ్‌పై

దీంతో రోహిత్‌ శర్మ టెస్టు ఓపెనింగ్‌పై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ "రోహిత్ శర్మ తనకు తానుగా టెస్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని ప్రకటించుకోవడం అద్భుతమైన అవకాశం. వార్మప్ మ్యాచ్‌లో అతడు రెండు బంతుల్లో డకౌట్ గురించి ఆలోచించడం లేదు" అని అన్నాడు.

ఓపెనర్‌గా రోహిత్ సక్సెస్ సాధిస్తే

ఓపెనర్‌గా రోహిత్ సక్సెస్ సాధిస్తే

"అయితే, ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ గనుక విజయవంతం కాకపోతే అందరూ అతడి గురించే మాట్లాడుకుంటారు. అతను తాత్కాలిక ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని మనం గుర్తుంచుకోవాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతడు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా సక్సెస్ అయ్యాడు కాబట్టి... టెస్టుల్లో కూడా అలానే సక్సెస్ అవుతాడన్న గ్యారెంటీ లేదు" అని గంభీర్ అన్నాడు.

రోహిత్‌ ఒత్తిడికి గురయ్యే అవకాశం

రోహిత్‌ ఒత్తిడికి గురయ్యే అవకాశం

"నన్ను నమ్మండి, రోహిత్‌ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నా అనుభవంతో చెబుతున్నా అదొక భయంకరంగా ఉంటుంది" అని గంభీర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

కోహ్లీ సైతం మద్దతు

కోహ్లీ సైతం మద్దతు

టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మకు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మద్దతుగా నిలిచాడు. రోహిత్‌శర్మ ప్రపంచంలో ఎక్కడైనా సహజసిద్ధమైన బ్యాటింగ్‌ చేస్తే ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తమే మారిపోతుందని కోహ్లీ పేర్కొన్నాడు. తొలి టెస్టుకు ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడాడు.

ఆటపై అవగాహన వచ్చేవరకు

ఆటపై అవగాహన వచ్చేవరకు

"టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ విషయంలో ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. భారత్‌లో ఆడేటప్పుడు ఒక ప్రణాళిక, విదేశాల్లో ఆడేటప్పుడు మరో ప్రణాళిక ఉంటుంది. ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలి. ప్రస్తుతం ఇది రోహిత్ శర్మకు సువర్ణావకాశం. ఈ మార్పుని జట్టు మేనేజ్ మెంట్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది" అని అన్నాడు.

రోహిత్‌ విషయంలో మాకేమీ తొందరలేదు

రోహిత్‌ విషయంలో మాకేమీ తొందరలేదు

"రోహిత్‌ విషయంలో మాకేమీ తొందరలేదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో కాస్త భిన్నంగా ఉంటుంది. రోహిత్ బాగా ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడమే అతడి బలం. గతంలో వీరూ భాయ్‌ ఎన్నో ఏళ్లు టీమిండియాకు ఇదే పని చేశాడు. ఎవరో చెబితే సెహ్వాగ్‌ దూకుడుగా ఆడి సెంచరీ బాదలేదు. అది అతడి సహజసిద్ధమైన బ్యాటింగే" అని విరాట్ కోహ్లీ అన్నాడు.

Story first published: Tuesday, October 1, 2019, 19:46 [IST]
Other articles published on Oct 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X