న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో అదే పెద్ద తేడా.. ఆర్‌సీబీ వైఫ్యలానికి కారణమదే: గౌతమ్ గంభీర్

Gautam Gambhir highlights difference between MS Dhoni and Virat Kohli’s captaincy

న్యూఢిల్లీ: ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం, జట్టుపై ఎంపికపై పూర్తి అవగాహన ఉండటమే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌)లో మహేంద్ర సింగ్ ధోనీ సక్సెస్‌కు కారణమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ లక్షణం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతోనే ఆ జట్టు విఫలమైందన్నాడు. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2020 సీజన్‌కు తెరలేవనున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న గంభీర్.. ధోనీ, కోహ్లీ కెప్టెన్సీల తేడాను విశ్లేషించాడు.

విరాట్‌కు అవగాహన లేదు..

విరాట్‌కు అవగాహన లేదు..

ఇక విరాట్‌ కోహ్లీకి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. అసలు తన అత్యుత్తమ ఎలెవన్‌ జట్టు ఎలా ఉండాలో విరాట్‌కు తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయని విమర్శలు గుప్పించాడు. ‘విరాట్ కోహ్లీ పదే పదే చెబతున్నట్లు ఆర్‌సీబీ జట్టుతో సంతోషంగా ఉండి ఉంటే అతను ఇప్పటికే అత్యుత్తమ ఎలెవన్‌పై ప్రణాళికలు చేసి ఉండేవాడు. సంతృప్తిగా ఉంటే ప్రశాంతత కోహ్లీ వెంటే ఉంటుంది. ఎందుకంటే టోర్నీ చరిత్రలో తుది జట్టపై విరాట్‌కు అవగాహనలేని సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే తరుచూ ఆటగాళ్లను మార్చేవాడు. కేవలం ఆర్‌సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే సరిపోతుందనే కోహ్లీ ఎప్పుడూ భావిస్తాడు.

ఆటగాళ్లపై భరోసా..

ఆటగాళ్లపై భరోసా..

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్( సీఎస్‌కే) జట్టు కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటుంది. కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను మారుస్తూ ముందుకు వెళ్తుంది. ఇదే ధోనీ-కోహ్లీ సారథ్యంలో ఉన్నా ప్రధాన తేడా. అటు సీఎస్‌కే సక్సెస్‌‌కు.. ఇటు ఆర్‌సీబీ వైఫల్యానికి కూడా ఇదే కారణం.

ఈ సీజన్‌లోనైనా అవకాశం ఇవ్వండి..

ఈ సీజన్‌లోనైనా అవకాశం ఇవ్వండి..

మ్యాచ్‌ మ్యాచ్‌కు క్రికెటర్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుంది. ఈ ఐపీఎల్‌లోనైనా ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆర్‌సీబీ ఆటగాళ్లను మార్చకుండా ఉండి నిలకడ కోసం ప్రయత్నించాలి. ఒకవేళ విరాట్ ప్రశాంతంగా ఆలోచిస్తే జట్టు సమతూకంగా ఉంటుంది. జట్టులోని ఆటగాళ్లు ఎలా ఆడుతారు? మరెలా రాణిస్తారనేదానితో అతని సారథ్యం గురించి చెప్పవచ్చు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఆర్‌సీబీ తమ ఐపీఎల్ 2020 ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

స్టార్ ఆటగాళ్లున్నా.. టైటిల్ గెలవలేదు..

స్టార్ ఆటగాళ్లున్నా.. టైటిల్ గెలవలేదు..

స్టార్ ఆటగాళ్లున్నా.. ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రెండు సార్లు ఆ అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. గత మూడు సీజన్లలోనైతే ఆ జట్టు ప్రదర్శన మరి దారుణం. పాయింట్స్ టేబుల్లో చివరి స్థానాల్లో నిలిచింది. దీంతో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి సారించే ఆ జట్టు.. సరైన బౌలర్లు లేక విఫలమైంది. ఈ సారి ఆ లోపాన్ని సరిదిద్దుకొని టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరీ ఈ సారైనా టైటిల్ కరువు తీర్చుకుంటుందో లేదో చూడాలి.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అంతర్జాతీయ క్రికెటర్!

Story first published: Monday, September 14, 2020, 15:45 [IST]
Other articles published on Sep 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X