న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత మహిళల జట్టు కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్‌ దరఖాస్తు!

Gary Kirsten Joins The Race To Become Indian Womens Cricket Head Coach: Reports

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవికి దరఖాస్తు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారత మహిళల క్రికెట్‌ నూతన కోచ్‌ నియామకం కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మాజీ క్రికెటర్లు మనోజ్ ప్రభాకర్, టామ్ మూడీ, వెంకటేశ్ ప్రసాద్, హర్షెల్ గిబ్స్, తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్ కూడా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతుతో తాను మళ్లీ చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు పొవార్ చెప్పిన సంగతి తెలిసిందే.

గ్యారీ కిర్‌స్టెన్ నేతృత్వంలో వరల్డ్‌కప్ నెగ్గిన టీమిండియా

గ్యారీ కిర్‌స్టెన్ నేతృత్వంలో వరల్డ్‌కప్ నెగ్గిన టీమిండియా

ఇదిలా ఉంటే, గ్యారీ కిర్‌స్టెన్ నేతృత్వంలోనే టీమిండియా 2011 వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2011-13 వరకు కిర్‌స్టెన్ దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన ప్యానల్‌ డిసెంబర్ 20న కోచ్‌ పదవి కోసం ఇంటర్యూ నిర్వహించనుంది.

 పొవార్‌ను మహిళల జట్టు తాత్కాలిక కోచ్‌గా

పొవార్‌ను మహిళల జట్టు తాత్కాలిక కోచ్‌గా

టీ20 వరల్డ్ కప్‌కు ముందే బీసీసీఐ రమేశ్ పొవార్‌ను మహిళల జట్టు తాత్కాలిక కోచ్‌గా నియమించింది. ఆగస్టులో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రమేశ్ పవార్ పదవికాలం నవంబర్ 30తో ముగిసింది. మళ్లీ రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును బోర్డు పొడిగించకుండా భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.

మిథాలీరాజ్‌ను తప్పించడంలో

మిథాలీరాజ్‌ను తప్పించడంలో

ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో సీనియర్ మిథాలీరాజ్‌ను తప్పించడంలో పొవార్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో పొవార్‌, సీనియర్‌ క్రికెటర్ మిథాలీరాజ్‌ మధ్య వివాదం చెలరేగింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ నుంచి మిథాలీ రాజ్‌ను తప్పించడంపై పొవార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఆసక్తికరంగా మారిన మహిళల జట్టు కోచ్ ఎంపిక

ఆసక్తికరంగా మారిన మహిళల జట్టు కోచ్ ఎంపిక

మిథాలీని తప్పంచడంపై అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలో రమేశ్ పొవార్‌ను కోచ్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ అయిష్టత చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మహిళల జట్టు టీ20 జట్టు కెప్టెన్ హర్మన్, వైస్ కెప్టెన్ మంధానలు పొవారే తమకు కోచ్‌గా కావాలని పట్టుబడుతుండటంతో కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది.

Story first published: Saturday, December 15, 2018, 17:14 [IST]
Other articles published on Dec 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X