న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం

Funny memes on Deepti Sharma including Ravi Ashwin after Charlie Dean runs out

లండన్: లార్డ్స్ స్టేడియం వేదికగా శనివారం ఇంగ్లాండ్ మహిళ జట్టుపై జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో ఓడించింది. చివరి వన్డే ఆడిన స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికింది. ఇది ఆమె చివరి వన్డే. మూడు వన్డేల ఈ సిరీస్‌ను భారత మహిళ జట్టు క్వీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్‌లో ఆ దేశ జట్టును 3-0 తేడాతో మట్టి కరిపించింది.

మన్కడింగ్ ద్వారా..

ఛార్లీ డీన్ అనూహ్యంగా అవుట్ అయింది. 44 ఓవర్‌లో మన్కడింగ్ ద్వారా అవుట్ అయిందామె. ఆ ఓవర్‌ను దీప్తి శర్మ సంధించింది. ఆ ఓవర్ మూడో బంతిని వేయడానికి దీప్తి శర్మ సిద్ధమైన తరుణంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఛార్లీ డీన్ క్రీజ్‌ను దాటి బయటికి వచ్చింది. దీనితో ఆ బంతిని సంధించకుండానే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల బెయిల్స్‌ను గిరాటేసింది దీప్తి శర్మ. అంపైర్ దీన్ని రనౌట్‌గా పరిగణించాడు.

గెలిచే మ్యాచ్..

చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో చివరి వికెట్‌గా ఛార్లీ డీన్.. మన్కడింగ్ ద్వారా అవుట్ కావడం ఇంగ్లాండ్ జట్టును దిగ్భ్రాంతికి గురి చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లు షాక్‌కు గురయ్యారు. అప్పటికే ఆమె 80 బంతుల్లో అయిదు ఫోర్లతో 47 పరుగులు చేసింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో ఛార్లీ కన్నీటి పర్యంతం అయింది. పిచ్ మీద ఏడ్చేసింది. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఫ్రేయా డేవిస్ ఆమెను ఓదార్చడం కనిపించింది.

సోషల్ మీడియాలో రచ్చ..

ఈ రనౌట్‌పై సోషల్ మీడియాలో రచ్చరచ్చ నడుస్తోంది. మీమ్స్ వెల్లువెత్తాయి. వివిధ దేశాల క్రికెటర్లు, మాజీలు రియాక్ట్ అవుతున్నారు. అటు నెటిజన్లు దీప్తి శర్మను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇందులోకి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను లాగడం హైలైట్. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిపి దీప్తిశర్మపై కామెంట్ చేస్తోన్నారు. ఇదివరకు ఐపీఎల్‌లో అతను మన్కడింగ్ ద్వారా ఇంగ్లాండ్‌కే చెందిన జోస్ బట్లర్‌ను అవుట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తోన్నారు.

ట్విట్టర్ డివైడ..

మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్, దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ స్పిన్ బౌలర్ తబ్రేజ్ షామ్సీ, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్, భారత సంతతికి చెందిన మాంటీ పనేసర్ వంటి వారు దీప్తిని సమర్థించారు, ఇది పూర్తిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనలకు లోబడి ఉందని అన్నారు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్.. దీప్తి శర్మపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఆమెకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశం లేదని, దృష్టి అంతా ఛార్లీ డీన్‌పై ఉంచిందని చెప్పారు.

Story first published: Sunday, September 25, 2022, 12:41 [IST]
Other articles published on Sep 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X