న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారీ ధర వెచ్చించి ఇద్దరు ఆల్‌రౌండర్లను తీసుకున్న చెన్నై.. మొత్తంగా ఏడుగురు! జట్టు ఇదే!

Full squad of Chennai Super Kings after IPL 2021 Auction, Moeen Ali and Krishnappa Gowtham included
IPL 2021 Auction : Chennai Super Kings Complete Players List, Squad

చెన్నై: త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021లో పాల్గొనేందుకు మాజీ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) క‌సిగా ఉంది. అందుకే గురువారం జ‌రిగిన ఐపీఎల్‌ 2021 ఆట‌గాళ్ల వేలంలో ఇద్దరు ఆల్‌రౌండర్లను తీసుకుంది. చెన్నై వేదికగా జరిగిన వేలానికి రూ.19.90 కోట్లతో వెళ్లిన చెన్నై.. ఆరుగురు ఆటగాళ్లని వేలంలో కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. ఇక రాజస్థాన్ రాయల్స్ నుంచి ఇటీవల ట్రేడ్ రూపంలో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (రూ.2 కోట్లు)ని తీసుకుంది. దాంతో మొత్తంగా కొత్తగా టీమ్‌లోకి ఏడుగురుని తీసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 వేలానికి ముందు హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్, మోను సింగ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్‌లను వదిలేసింది. గురువారం జరిగిన వేలంలో కృష్ణప్ప గౌతమ్ (రూ.9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ.7 కోట్లు)లని భారీ ధరకి దక్కించుకుంది. అలీ కోసం పెద్దగా శ్రమించకపోయినా.. గౌతమ్ కోసం అయితే మిగతా జట్లతో బాగానే పోటీ పడింది. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (రూ.50 లక్షలు), హరిశంకర్ రెడ్డి (రూ.20 లక్షలు), భగవత్ వర్మ (రూ.20 లక్షలు), సి హరి నిశాంత్ (రూ. 20 లక్షలు)లను కనీస ధరకే చెన్నై కొనుగోలు చేసింది.

ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన మొయిన్ అలీని వేలంలో కొనుగోలు చేయాలని చెన్నై అభిమానులు ఆ ఫ్రాంఛైజీని ట్విట్టర్‌లో రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వేలానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌.. ఎంఎస్ ధోనీకి ఓ సూచన చేశారు. సీనియర్ హర్భజన్ ‌సింగ్‌ను చెన్నై వేలంలోకి విడుదల చేయడంతో ఈసారి ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ను తీసుకోవచ్చని, అది కూడా మొయిన్‌ అలీని తీసుకోవాలని సూచించారు. మరి గౌతీ మాటలను చెన్నై సీరియస్‌గా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. మొత్తానికి అతడికి భారీ ధరకు కొనుగోలుచేసింది.

చెన్నై జట్టు ఇదే:
ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, దీపక్ చహర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, ఎన్ జగదీశన్, కర్ణ్ శర్మ, లుంగి ఎంగిడి, మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శార్ధూల్ ఠాకూర్, శామ్ కరన్, జోష్ హేజిల్‌వుడ్, ఆర్ సాయి కిషోర్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్, చతేశ్వర్ పుజారా, హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ, హరి నిశాంత్.

IPL 2021 Auction: కోల్‌కతా కొనుగోలు చేయడంపై హర్భజన్‌ ఏమన్నాడంటే?.. ఆ మాట నిలబెట్టుకుంటాడా!!IPL 2021 Auction: కోల్‌కతా కొనుగోలు చేయడంపై హర్భజన్‌ ఏమన్నాడంటే?.. ఆ మాట నిలబెట్టుకుంటాడా!!

Story first published: Friday, February 19, 2021, 15:21 [IST]
Other articles published on Feb 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X