న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన్కడింగ్‌పై డిబేట్: రనౌట్ అని పిలవండి అంటూ హర్షా భోగ్లే ట్వీట్

Harsha Bhogle's Tweet About Calling It Run Out And Not Mankad || Oneindia Telugu
Fresh Mankading Debate Breaks Out: Harsha Bhogle Suggests Renaming The Term, Netizens Offer Wide-ranging Opinions

హైదరాబాద్: మన్కడింగ్‌ ఔట్‌ని మన్కడింగ్‌‌కు బదులు రనౌట్‌గా పిలవాలని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కోరాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ఓపెనర్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడంతో ఈ పదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

'మన్కడింగ్' రనౌట్ చేయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్‌లో గెలిచేందుకే అశ్విన్ అలా చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు. ఈ మన్కడింగ్ రనౌట్ విషయంలో అటు క్రికెటర్లు, ఇటు అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.

క్రికెట్ నిబంధనలకు లోబడే అశ్విన్ రనౌట్ చేశాడని కొందరు భావిస్తుండగా... మరికొందరు మాత్రం అశ్విన్ తీరు అనైతికంగా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మన్కడింగ్ రనౌట్ విషయంలో అశ్విన్‌ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది.

మన్కడింగ్ కాదు రనౌట్ అని పిలవండి

అయితే, తాజాగా ఈ మన్కడింగ్ రనౌట్‌పై హర్షా భోగ్లే తన ట్విట్టర్‌లో "వినూ మన్కడ్ చాలా గొప్ప క్రికెటర్. బిల్లి బ్రౌన్‌ని ఆయన న్యాయంగానే ఔట్ చేశారు. సర్ డాన్ బ్రాడ్‌మెన్ సైతం దాన్ని తప్పుబట్టలేదు. కాబట్టి దాన్ని ‘మన్కడెడ్' అని పిలవడం అవమానకరంగా ఉంది. అది వాళ్ల కుటుంబానికి బాధను కలిగిస్తుంది. దీనిని మన్కడింగ్ అని పిలవడం మానేసి రనౌట్ అని పిలవండి" అని ట్వీట్ చేశారు.

మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించండి

మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించండి

మరోవైపు ఈ మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) సూచించిన సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని తప్పుబట్టాడు. అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ గవాస్కర్ స్పష్టం చేశాడు.

'మన్కడింగ్‌ ఔట్' అంటే ఏంటి?

'మన్కడింగ్‌ ఔట్' అంటే ఏంటి?

క్రికెట్‌ నియమావళి 41.16 ప్రకారం నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్‌ రనౌట్‌ చేసే విధానాన్ని మన్కడింగ్‌ అంటారు. అయితే దీన్ని1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్‌ వినూ మన్కడ్‌ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ నిబంధనగా క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) నియమావళిలో చేర్చింది.

1948లో ఆసీస్‌ భారత పర్యటనలో

1948లో ఆసీస్‌ భారత పర్యటనలో

1948లో ఆసీస్‌ భారత పర్యటనలో భాగంగా భారత బౌలర్‌ వినో మన్కడ్‌ ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ బిల్‌ బ్రౌన్‌ను ఇలాగే రెండుసార్లు ఔట్‌ చేశాడు. మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు.

బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత

బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత

దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ విధానాన్ని అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. అయితే అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ఈ విధానాన్ని అంగీకరించడం కొసమెరుపు. అనంతరం భారత బౌలర్‌ పేరుతోనే ఈ విధానానికి మన్కడింగ్‌ అని పేరు పెట్టారు.

Story first published: Thursday, April 18, 2019, 17:38 [IST]
Other articles published on Apr 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X