న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీతో క్రికెట్‌ ఆడడం అదృష్టం: కేన్‌ విలియమ్స్‌

Fortunate to have played cricket along side Virat Kohli says Kane Williamson

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీతో కలిసి క్రికెట్‌ ఆడటాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు కేన్‌ పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి కోహ్లీని దగ్గర నుంచి పరిశీలిస్తున్నానని కివీస్ కెప్టెన్ అన్నాడు. 2008 ఐసీసీ అండర్‌-19 ఆరంగేట్రంతో ప్రపంచకప్‌లో కోహ్లీ యువ భారత జట్టుకు సారథ్యం వహించగా.. కివీస్‌ జట్టుకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది.

బద్రీనాథ్‌, బాలాజీ నుంచి రెండు పెద్ద పాఠాలు నేర్చుకున్నా: విజయ్‌శంకర్‌బద్రీనాథ్‌, బాలాజీ నుంచి రెండు పెద్ద పాఠాలు నేర్చుకున్నా: విజయ్‌శంకర్‌

2008 అండర్‌-19 ప్రపంచకప్‌ నుంచి కోహ్లీ, కేన్ తమ నైపుణ్యాలకు సానపెడుతూ ఆధునిక క్రికెట్లో ఉత్తమ ఆటగాళ్లుగా ఎదిగారు. ఇటీవల సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగానూ ఈ ఇద్దరు సారథులు బౌండ్రీ లైన్‌ సమీపంలో కూర్చొని మ్యాచ్‌ గురించి ముచ్చటిస్తూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. కేన్ గాయం కారణంగా జట్టుకు దూరమవగా.. కోహ్లీ కుర్రాళ్లను పరీక్షించే క్రమంలో మ్యాచ్ ఆడలేదు.

తాజాగా ఓ షోలో కేన్‌ విలియమ్సన్ మాట్లాడుతూ... 'కోహ్లీ, నేను ఒకే తరంలో క్రికెట్‌ ఆడటం మా అదృష్టం. చిన్న వయస్సులోనే మేమిద్దరం కలుసుకున్నాం. దీంతో అతడి పురోగతిని దగ్గర నుంచి పరిశీలించా. చాన్నాళ్లుగా ఆటలో కొనసాగుతున్నాం. ఇటీవలి కాలంలో ఎప్పుడు కలిసినా ఆట గురించే కాకుండా.. ఇంకా చాలా విషయాల గురించి చర్చిస్తుంటాం. మైదానంలో ఇద్దరం కాస్త భిన్నంగా ఆలోచించినా.. ఇద్దరి ఆలోచనా సరళి మాత్రం దాదాపు ఒకే విధంగా ఉంటుంది' అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు. అంతకుముందు విరాట్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో జన్మించిన తామిద్దరం ఒకే విధంగా ఆలోచిస్తామని.. విలియమ్సన్‌ మంచి మనసున్న ఆటగాడని కోహ్లీ ప్రశంసించాడు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు. మరోవైపు కేన్‌ కివీస్ తరపున 80 టెస్టులు, 151 వన్డేలు, 60 టీ20లు ఆడాడు.

Story first published: Monday, June 8, 2020, 8:59 [IST]
Other articles published on Jun 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X