ఆస్ట్రేలియా జట్టుకు మొండిచేయి చూపించిన మైకేల్‌ క్లార్క్‌

Posted By:
Former Test skipper Michael Clarke offers to rescue Australia over ball tampering crisis

హైదరాబాద్: బ్యాల్ ట్యాంపరింగ్ విషయంతో చతికిల బడ్డ ఆస్ట్రేలియా జట్టుకు మళ్లీ మైకేల్ కార్క్ వస్తున్నాడంటూ వచ్చిన వార్తలు ఆశలు రేపాయి. అదే విషయం అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమవడంతో కార్క్ అభిమానుల్లోనూ, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు మొదలైయ్యాయి.

ఈ విషయంపై క్లార్క్ సైతం స్పందించి ..టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటే తాను తిరిగి మైదానంలోకి దిగుతానని చెప్పినట్లు సిడ్నీ సండే టెలిగ్రాఫ్‌ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఐపీఎల్‌ కోసం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ ఆ కథనంపై స్పందించాడు. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ట్విటర్‌లో ప్రకటించాడు.

'జట్టుకు తిరిగి ఆడతానని నేనేం ఆహ్వానం పంపలేదు. ఆ కథనం నిజంకాదు. క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ జేమ్స్‌ సుథర్‌ల్యాండ్‌కు ఓ స్నేహితుడిగా సందేశం పంపాను. అవసరమైతే జట్టుకు ఏ రూపంలో అయినా సాయం అందిస్తానని చెప్పాను. అంతేగానీ తిరిగి ఆడతానని నేను అనలేదు' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టు టెస్ట్‌ ర్యాంక్‌ కోల్పోవటంపై స్పందిస్తూ..

'ఆస్ట్రేలియా పరిస్థితి.. వెస్టిండీస్‌లాగా మారాలని నేను కోరుకోవటం లేదు. తొందర్లోనే తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నా' అని మాత్రం తాను చెప్పినట్లు క్లార్క్‌ వెల్లడించాడు. 37 మైకేల్‌ క్లార్క్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తం 245 వడ్డేలు, 115 టెస్టులు, 34 టీ20లు అడిన అనుభవం క్లార్క్‌ సొంతం. 2015లో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన అనంతరం కామెంటేటర్‌ అవతారం ఎత్తాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 8, 2018, 12:51 [IST]
Other articles published on Apr 8, 2018
Read in English: Clarke rules out comeback

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి