న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ కామెంటేటరీ టీమ్‌లో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం

By Nageshwara Rao
Former Sri Lanka skipper Kumar Sangakkara rejoins IPL commentary team

హైదరాబాద్: క్రికెట్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సొగసైన షాట్లను ఆడతారు. సిక్స్ బాదారంటే చాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇందుకు నిదర్శనం కుమార సంగక్కర. శ్రీలంకకు చెందిన ఈ మాజీ క్రికెట్ దిగ్గజం ప్రపంచ క్రికెట్ అందించిన అత్యుత్తమ క్రికెటర్లలొ ఒకడు.

శ్రీలంకతో పాటు భారత క్రికెట్‌ అభిమానులకు అతడి గొప్ప ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం లభించింది. వరుసపెట్టి మ్యాచ్‌ల తర్వాత మ్యాచ్‌ల్లో కుమార సంగక్కర సుదీర్ఘమైన గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కొన్నాళ్లు సంగక్కర క్లబ్ క్రికెట్ ఆడాడు.

అక్కడ కూడా కుమార సంగక్కర తన మార్కుని చూపించాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన 40 ఏళ్ల కుమార సంగక్కర కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో సంగక్కర కామెంటేటర్‌గా వ్యవహారించనున్నాడు.

కామెంటరీ బాక్సు నుంచి పలువురు మాజీ క్రికెటర్లతో కలిసి క్రికెట్‌కు సంబంధించిన అనాలసిస్‌ను అభిమానులతో పంచుకోనున్నాడు. అంతేకాదు స్టార్ నెట్‌వర్క్ స్టూడియో నుంచే ఐపీఎల్ మ్యాచ్‌ ముందు మ్యాచ్‌ తర్వాత నిపుణుల అభిప్రాయాలపై విశ్లేషించనున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి సంగక్కర కామెంటేటర్‌గా విధులు నిర్వహించాడు. కుమార సంగక్కర మంచి వ్యక్త. 2011లో ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో కౌడ్రే మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఈ విషయం ఎప్పుడు వెల్లడైంది.

జూన్ నెలలో బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో కుమార సంగక్కర పటౌడీ మెమోరియల్ లెక్చర్‌పై కూడా ప్రసంగించనున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే పాకిస్థాన్, ఇండియా టెస్టు సిరిస్‌లకు సంబంధించి స్కై స్పోర్ట్స్ కామెంటేటరీ ప్యానెల్ నుంచి సంగక్కరకు ఆహ్వానం వచ్చింది.

శ్రీలంక తరుపున సుమారు 500కుపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన కుమార సంగక్కర 26,000పైగా పరుగులు చేశాడు. శ్రీలంక తరుపున సుమారు 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడాడు. కుమార సంగక్కర, మహిళా జయవర్దనే లాంటి దిగ్గజ క్రికెటర్లు వీడ్కోలు పలికిన తర్వాత ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా తయారైంది.

Story first published: Friday, May 18, 2018, 16:31 [IST]
Other articles published on May 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X