న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PHOTOS: రెండో పెళ్లి చేసుకున్న స్మిత్

Former South Africa skipper Graeme Smith finds love again, ties the knot for second time

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పెళ్లి చేసుకున్నాడు. అయితే, స్మిత్‌కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2015లో తన మొదటి భార్య మోర్గాన్ డేన్ నుంచి విడిపోయిన గ్రేమ్ స్మిత్ తాజాగా తన ప్రేయసి రోమీ లాంఫ్రాంచీని పెళ్లాడాడు. ఈ విషయాన్ని స్వయంగా స్మిత్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

గత ఏడాది ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స్మిత్ రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నవంబరు 2,శనివారం తన జీవితంలో మరిచిపోలేని లేని రోజంటూ ట్విట్టర్‌లో పెళ్లి ఫోటోను పోస్టు చేశాడు. ఈ సందర్భంగా స్మిత్‌కు అభిమానులు నెటిజన్లు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రిషబ్ పంత్‌కు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇచ్చిన సలహా ఇదే!రిషబ్ పంత్‌కు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇచ్చిన సలహా ఇదే!

ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు

దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచిన రోజున స్మిత్ విహహం జరిగింది. మరోవైపు రోమీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. కాగా, 2011లో ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకున్నాడు.

2015లో మొదటి భార్యకు విడాకులు

అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల 2015 ఫిబ్రవరిలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అప్పటికే వారికి ఓ పాప కాడెన్స్ (7), బాబు కార్టర్ (6) ఉన్నారు. మోర్గాన్‌తో విడాకుల అనంతరం 2016, డిసెంబర్‌లో రోమి ఓ బాబుకు జన్మనిచ్చింది.

ఎన్నో అద్భుతమైన విజయాలు

ఎన్నో అద్భుతమైన విజయాలు

22 ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన గ్రేమ్ స్మిత్‌ ఆ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు. దక్షిణాఫ్రికా తరుపున 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో స్మిత్ అన్ని ఫార్మాట్లు కలుపుకుని 17000 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు 277, వన్డేల్లో 141 స్కోరుగా ఉంది.

ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా

ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా

2014లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్రేమ్ స్మిత్ ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు. ఇటీవలే భారత్ వేదికగా ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారించాడు.

Story first published: Tuesday, November 5, 2019, 19:13 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X