న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సోదరుడి దారుణహత్య: కేప్‌టౌన్‌లో ఇంటికి సమీపంలో: కుప్పకూలిన తల్లి

Former South Africa pacer Vernon Philanders younger brother shot dead in Cape Town

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ సోదరుడు టైరాన్ దారుణ హత్యకు గురయ్యారు. కేప్‌టౌన్‌లోని రావెన్స్‌మీడ్ ప్రాంతంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. ఆయన ఇంటికి అతి సమీపంలోనే ఈ దారుణం సంభవించింది. ఆయన వయస్సు 32 సంవత్సరాలు. ఫిలాండర్‌కు అతను చిన్న తమ్ముడు. రక్తపు మడుగులో పడి ఉన్న తన కుమారుడిని చూసిన ఆయన తల్లి సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.

కేదార్ జాదవ్: ఒక్క పరుగు = రూ.10 లక్షలు: రూ. 23 కోట్లు ధారపోసినా: వరుసగా మూడో సీజన్‌లోకేదార్ జాదవ్: ఒక్క పరుగు = రూ.10 లక్షలు: రూ. 23 కోట్లు ధారపోసినా: వరుసగా మూడో సీజన్‌లో

తన సోదరుడి మరణ వార్తను ఫిలాండర్ ధృవీకరించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. తన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయని చెప్పాడు. కుటుంబ సభ్యుడిని కోల్పోయానని పేర్కొన్నాడు. టైరాన్ తనకు సోదరుడు మాత్రమే కాదని, ఆప్తుడిగా, స్నేహితుడిగా, అన్ని విధాలా తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఈ ఘటనపై తాము సమగ్ర దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని వెస్టర్న్ కేప్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి కేప్టెన్ ఎప్‌సీ వ్యాన్‌విక్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:10 నిమిషాలకు ఈ ఘటన సంభవించింది. రావెన్స్‌మీడ్ ప్రాంతంలోని 7వ అవెన్యూ, వెబ‌్‌నెర్ స్ట్రీట్‌లో రక్తపు మడుగులో టైరాన్ మృతదేహం కనిపించింది. 7వ అవెన్యూ ప్రాంతంలోనే టైరాన్ కుటుంబం నివాసం ఉంటోంది. తన కుమారుడు హత్యకు గురయ్యాడనే సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన తల్లి బోంటియా, ఇతర కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్న టైరాన్‌ను చూసిన వెంటనే బోంటియా అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు.

టైరాన్‌ను హత్య చేయడానికి గల కారణాలపై వెస్టర్న్ కేప్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారని ఆఫ్రికన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సంఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. కాగా- 34 సంవత్సరాల ఫిలాండర్.. దక్షిణాఫ్రికా క్రికెట్‌ తరఫున టెస్టు, వన్డే మ్యాచ్‌లను ఆడాడు. 64 టెస్ట్ మ్యాచ్‌లల్లో 224 వికెట్లను పడగొట్టాడు. ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు తెలిపాడు. కుటుంబంతో కలిసి కేప్‌టౌన్‌లో నివసిస్తున్నాడు. ఈ ఘటన పట్ల దక్షిణాఫ్రికా క్రికెటర్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఫిలాండర్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.

Story first published: Thursday, October 8, 2020, 13:39 [IST]
Other articles published on Oct 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X